iDreamPost
android-app
ios-app

దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్‌..!

  • Published Feb 01, 2022 | 11:41 AM Updated Updated Feb 01, 2022 | 11:41 AM
  • Published Feb 01, 2022 | 11:41 AMUpdated Feb 01, 2022 | 11:41 AM
దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్‌..!

అంచ‌నాల‌కు భిన్నంగా కేంద్ర బ‌డ్జెట్ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నందున భారీగా తాయిలాలు ఉంటాయ‌ని ఆశించిన వారికి భంగం వాటిల్లింది. దుస్తులు, చెప్పుల ధ‌ర‌లు త‌గ్గ‌డం మిన‌హా సామాన్యుల‌కు పెద్ద‌గా ఊర‌టనిచ్చే అంశాలు లేవు. అలాగే వేత‌న జీవుల‌ను ఊరించ‌కుండా, ఉసూరుమ‌నిపించ‌కుండా వ్య‌వ‌హ‌రించింది కేంద్రం. పన్ను స్లాబ్‌లలో ఎటువంటి మార్పులూ లేకుండా య‌థాత‌థంగా కొన‌సాగించింది. అయితే, ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఈ బడ్జెట్ లో వెసులుబాటు లభించింది. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును రెండేళ్లకు పెంచింది. రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.

కొన్ని కొత్త సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది కేంద్రం. డిజిట‌ల్ రూపీ, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, ఈ- పాస్‌పోర్టు వంటి వాటితో పాటు.. దేశంలో ఎక్క‌డి నుంచైనా రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఒకే దేశం – ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్‌వేర్‌ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌(NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. “మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ – వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు” సీతారామన్ తెలిపారు.

అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి రెండువేల అయిదు వంద‌ల ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్‌ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.

Also Read : వ‌చ్చే నెల‌లోనే మార్కోట్లోకి ఎల్ ఐ సీ?

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet