iDreamPost
android-app
ios-app

కుమార్ సాయి అవుట్ – వీకెండ్ హంగామా

  • Published Oct 19, 2020 | 5:36 AM Updated Updated Oct 19, 2020 | 5:36 AM
కుమార్ సాయి అవుట్ –  వీకెండ్ హంగామా

మొన్నే వచ్చిన లీకు నిజమయ్యింది. బిగ్ బాస్ 4 ఫ్రెష్ ఎలిమినేషన్ లో భాగంగా కుమార్ సాయి బయటికి వెళ్ళిపోయాడు. తక్కువ ఓట్లు వచ్చిన వారిలో మోనాల్ తో పాటు తను కూడా ఉన్నాడని ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున ఫైనల్ గా వైల్డ్ కార్డు ఎంట్రీకి గేటు దారి చూపించేశారు. దీనికి ముందు కావాల్సినంత డ్రామా నడిచింది. ఇద్దరినీ లగేజీలు సర్దుకోమని చెప్పినప్పుడు మోనాల్ ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో ఏడ్చుకుంటూ సాగింది. కుమార్ సాయిలో మాత్రం ఎలాంటి నిరాశ నిస్పృహ కనిపించలేదు. నవ్వుతూనే ఉన్నాడు. మోనాల్ బ్యాగుని రెడీ చేసుకుంటూ ఉండగా అఖిల్ కళ్ళలో మాములు విరహ వేదన బాధ కనిపించలేదు. ఎన్ని జన్మల బంధమో వీడిపోతోందనే రేంజ్ లో ఎక్స్ ప్రెషన్లు ఇచ్చాడు.

మోనాల్ కూడా తానేమి తక్కువ తినలేదు తరహాలో వెళ్తూ అతనికో హగ్ కూడా ఇచ్చింది. ఇక కుమార్ సాయి బయటికి వచ్చాక తన మూడింట్లో రెండు కోరికలు తీరలేదని చెప్పాడు. ఒకటి గెలవడం, రెండు హౌస్ నుంచి వచ్చేలోపు వ్యాక్సిన్ రావడం. అవి జరగలేదు. ఇక మిగిలింది నాగార్జునకు ఓ కథ చెప్పడం. దానికి మాత్రం నాగ్ తప్పకుండా అని హామీ ఇచ్చారు. ఇక కుమార్ సాయి తన కో సభ్యులను కాయగూరలతో పోల్చి వెరైటీ కామెడీ చేశాడు. అరియనాను ఉల్లిపాయ, అవినాష్ ని అరటిపండు, అఖిల్ ని కరివేపాకు, అమ్మ రాజశేఖర్ ని కాకరకాయ, అభిజిత్ ని కీరదోస, లాస్యను మొక్కజొన్న, నోయెల్ ని క్యాబేజ్, సోహైల్ ని వేరుశెనగ, దివిని పైనాపిల్, హారికని వంకాయ, మెహబూబ్ ని బాయిల్డ్ ఎగ్ ల పేర్లు ఇచ్చేశాడు. ఇదంతా సరదాగా సాగింది

తనకు కరివేపాకు అన్నందుకు అఖిల్ వెంటనే కుమార్ సాయి మీద ఫైర్ అయ్యాడు. ఎంత రెచ్చగొట్టినా కుమార్ సాయి సాయి మాత్రం కూల్ గా ఉన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ బాంబ్ అమ్మ రాజశేఖర్ మీద వేశాడు. వారం మొత్తం వాష్ రూములు కడిగే బృహత్తర కార్యాన్ని అతని భుజాలపై వేశాడు. దీంతో అతనికి గట్టి షాక్ తగిలింది. ఇక మిగిలిన ఎపిసోడ్ ని ఆటపాటలతో అలా కానిచ్చేశారు. కొన్ని ఆటవిడుపుగా ఉన్నప్పటికీ మరికొన్ని చప్పగా ఉంటున్నాయి. ఇప్పటికి జరిగింది ఆరు వారాలే. ఇంకా చాలా గేమ్ ఉంది. రెండు నెలలకు పైగా సాగాలి. ఒకపక్క ఐపిఎల్ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో వీక్ డేస్ ని పార్టిసిపెంట్స్ ఎలా మేనేజ్ చేస్తారో, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంకెవరెవరు రాబోతున్నారో వేచి చూడాలి. నాగార్జున కొనసాగే విషయంలో ఇక ఎలాంటి అనుమానాలు లేనట్టే.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişCasibomMarsbahis Giriş