ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు విడుదల క్రమంలో నెంబర్ వారీగా చెప్పడం అంటే కష్టమే. వకీల్ సాబ్ వేసవిలో రావడం కన్ఫర్మ్ అయినప్పటికీ ఆ తర్వాత అయ్యప్పనుం కోషియం రీమేక్ ఫిక్స్ అవ్వడం కూడా దాదాపు ఖరారే. నెక్స్ట్ క్రిష్ మూవీ లైన్ లో ఉంది. అయితే బడ్జెట్ అండ్ సబ్జెక్టు దృష్ట్యా అది అంత వేగంగా పూర్తవుతుందా లేక హరీష్ శంకర్ ది వరసలో ముందుకుకు వస్తుందా అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఇంకో మూడేళ్ళలో ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా పవన్ చాలా వేగంగానే వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే కనీసం జనసేన ప్రచారానికి కూడా టైం ఉండదు.
ఇదిలా ఉండగా హరీష్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీని గట్టిగా ట్రై చేస్తున్నారట. బాలీవుడ్ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్న ఈ భామ ఆ మధ్య రెండు మూడు మంచి తెలుగు ఆఫర్లను వదులుకుంది. భరత్ అనే నేనుతో పరిచయమై డెబ్యూతోనే హిట్టు బోణీ కొట్టిన కియారాకు వినయ విధేయ రామా రూపంలో పెద్ద షాకే తగిలింది. అయితే దాని వల్ల డ్యామేజ్ జరిగింది బోయపాటి శీను, చరణ్ లకు తప్ప తనకేమి కాలేదు. అయితే పవన్ సరసన జోడి అంటే వెంటనే నో చెప్పకపోవచ్చు.
హిందీలో కబీర్ సింగ్ తర్వాత కియారాకు చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు లేవు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజైన ఇందూ కి జవానీ కూడా దారుణంగా బోల్తా కొట్టింది. కొంచెం ఫోకస్ పెట్టాలే కానీ హీరోయిన్ల కొరత ఉన్న టాలీవుడ్ లో పూజ హెగ్డే రేంజ్ లో గట్టి జెండా పాతే అవకాశం చాలా ఉంది. ఎలాగూ స్టార్ హీరోలకు పూజాతో పాటు రష్మిక మందన్న తప్ప పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. అయితే కియారా పవన్ జోడిగా ఆఫర్ ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. షూటింగ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దీని గురించి ఇప్పటికిప్పుడు ఒక కంక్లూజన్ కు రాలేం కాబట్టి వేచి చూడాలి