iDreamPost
android-app
ios-app

ఎబివి ఎపిసోడ్ లో కేశినేని చీర్స్…!!

ఎబివి ఎపిసోడ్ లో  కేశినేని చీర్స్…!!

 ట్విట్టర్లో పోస్ట్

 తెలుగు దేశానికి గత నెల రోజులుగా వరుస దెబ్బలు తగులుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి అక్రమ వ్యాపారాలు, పాత వాహనాలను కొత్తవిగా మార్చేసి, ఎస్సై సంతకం ఫోర్జరీ చేసి మరీ అమ్మేసిన కేసు గట్టిగానే తగిలేలా ఉంది. అదలా ఉండగానే టిడిపికి సహకరించడంతోబాటు మొత్తము పోలీస్ వ్యవస్థకే కళంకం తెచ్చిన ఆరోపణలపై అదనపు డిజిపి, చంద్రబాబుకు కుడి భుజంగా ఉన్న ఏబీ వెంకటేశ్వర రావు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

దేశద్రోహ ఆరోపణలు కూడా ఉన్నట్లున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లడం కుదరదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది టిడిపికి అతి పెద్ద దెబ్బ. ఏ నాయకుడు కూడా కిక్కురుమనలేని పరిస్థితి. అందరూ తెలుకుట్టిన దొంగల్లా గప్ చుప్ గా ఉన్నారు. అయితేఅందరూ గుంభనగా ఉన్న ఈ టైములో విజయవాడ ఎంపీ కేశినేని నాని సైలెన్స్ బ్రేక్ చేశారు..
టిడిపి ఓడిపోవడానికి, మీరు(జగన్) గెలవడానికి ప్రధాన కారణమైన ఎబివి గారిని మీరు సత్కరిస్తారనుకున్నాను అంటూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ పేల్చారు.

తమ పార్టీకి మద్దతుగా నిలిచి ఎన్నో అక్రమాలు, అవినీతి, అనైతిక పనులకు పాల్పడిన వెంకటేశ్వర రావు మీద నానికి ఎంత కడుపు మంట ఉందో ఈ ఒక్క ట్వీట్ స్పష్టం చేసింది. ఆయితే నాని చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. వాస్తవానికి వెంకటేశ్వర రావు తాను ఒక పోలీస్ ఆఫీసర్ ను అని ఎన్నడూ అనుకోలేదని, తనకు చంద్రబాబే బాస్ అని, ఆయన్ను సంతృప్తి పరిస్తే చాలని భావించేవారని టిడిపి లీడర్లందరికి తెలుసు.

వాస్తవానికి పార్టీ కార్యకలాపాలు, ఇతరత్రా వ్యవహారాల్లో ఆయనకు సంబంధం లేకున్నా “అంతకు మించి”ఉత్సాహంగా పాల్గొని అన్నీ తానై నడిపించేవారని, ఈ విషయంలో నాని లాంటి కొందరు నాయకులను సైతం లెక్కచేసేవారు కాదని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని కేశినేని నాని బహిరంగంగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారని టిడిపి నేతలు అంటున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkare girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis