iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 16 – ఓటిటి వినోదం

  • Published Sep 15, 2022 | 6:08 PM Updated Updated Dec 07, 2023 | 4:01 PM

వాటికి ధీటుగా ఓటిటిలు కూడా వినోదాన్ని అందించేందుకు ప్రతి శుక్రవారం రెడీ అవుతున్నాయి.

వాటికి ధీటుగా ఓటిటిలు కూడా వినోదాన్ని అందించేందుకు ప్రతి శుక్రవారం రెడీ అవుతున్నాయి.

  • Published Sep 15, 2022 | 6:08 PMUpdated Dec 07, 2023 | 4:01 PM
సెప్టెంబర్ 16 – ఓటిటి వినోదం

రేపు ఎల్లుండి థియేటర్లలో ఎనిమిది సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటికి ధీటుగా ఓటిటిలు కూడా వినోదాన్ని అందించేందుకు ప్రతి శుక్రవారం రెడీ అవుతున్నాయి. ఏదో ఒకటి ఖచ్చితంగా బజ్ ఉండేది వీటిలో ఉండటం వల్ల ఇల్లు కదలకుండా చూడాల్సిన ఆప్షన్లు కనీసం రెండు మూడైనా ఉంటున్నాయి. మొదటిది విక్రాంత్ రోనా. ఈగ విలన్ కిచ్చ సుదీప్ నటించిన ఈ హారర్ కం సస్పెన్స్ డ్రామా కొద్దిరోజుల క్రితమే జీ5లో కన్నడలో వచ్చింది. ఇతర డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేయలేదు. ఇప్పుడా నిరీక్షణ ఫలించింది. బిగ్ స్క్రీన్ మీద వచ్చేందుకు ట్రై చేసి డిజిటల్ లో రావడమే బెస్ట్ అని భావించిన కిరోసిన్ ఆహా యాప్ లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
aha kerosene
నెట్ ఫ్లిక్స్ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోగిని హిందీతో పాటు తెలుగు ఇతరత్రా ఆడియోలతో వదలనున్నారు. సోని లివ్ లో కాలేజీ రొమాన్స్ సీజన్ 3 అందుబాటులోకి వస్తుంది. మంచు విష్ణు డిజాస్టర్ మోసగాళ్లు గతంలో ప్రైమ్ లో వచ్చింది కానీ తాజాగా ఆహాలోనూ చూడొచ్చు. హాట్ స్టార్ లో దహన్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ రానుంది. దీని మీద మంచి అంచనాలున్నాయి. మన భాషలోనూ చక్కగా చూసేయొచ్చు. రామారావు ఆన్ డ్యూటీ నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ అవుతున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో అటెన్షన్ ప్లీజ్ సైతం రేపే. దాదాపుగా సినిమా సిరీస్ అనే తేడా లేకుండా అన్నీ మల్టీ ఆడియోలతో వస్తున్నవే. సబ్ టైటిల్స్ అవసరం లేకుండా ఆప్షన్లు ఇస్తున్నాయి.
September 16 - OTT entertainment 2
ఇవి కాకుండా బోలెడు ఇంగ్లీష్ మూవీస్ కూడా రేపే రానున్నాయి గుడ్ నైట్ మమ్మీ(ప్రైమ్), ఫేట్ – ది విన్క్స్ సాగా(నెట్ ఫ్లిక్స్), స్పానిష్ లో శాంటో(నెట్ ఫ్లిక్స్), లవ్ ఈజ్ బ్లైండ్, ఫైండింగ్ హబ్బీ 2, డూ రివెంజ్, ఐ యుస్డ్ టు బీ ఫేమస్, ది బ్రేవ్ వన్స్, డ్రిఫ్టింగ్ హోమ్ ఇవన్నీ అదే ప్లాట్ ఫార్మ్ లోనే రాబోతున్నాయి. ఇక కొరియన్ తదితర భాషలు చూసుకుంటే ఈ లిస్టు ఇంకా పెద్దది అవుతుంది. నిరాశ కలిగించే అంశం ఏమిటంటే రామారావు తప్ప టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కానీ సిరీస్ కానీ వీటిలో లేవు. లాస్ట్ వీక్ వచ్చిన సీతారామమే ఇంకా టాప్ ట్రెండింగ్ లో ఉంది. వచ్చే వారం సెప్టెంబర్ 23న మరికొన్ని ఉండే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే వీటితో సర్దుకోక తప్పదు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet