హీరోయిన్ కీర్తి సురేష్ మొదట్లో కాస్త బొద్దుగా కన్పించింది. అలాగని ఆమె మరీ బొద్దుగా వుండేది కాదు. కానీ, అనూహ్యంగా ఆమె సన్నబడిపోయింది. అదీ ‘మిస్ ఇండియా’ సినిమా కోసం. కాదు కాదు, ఓ బాలీవుడ్ సినిమా కోసం చాలా చాలా కష్టపడి సన్నబడింది కీర్తి సురేష్. అయితే, ఆ సినిమా కాస్తా ప్రారంభమవకుండానే ఆగిపోయేసరికి కీర్తి సురేష్ డీలా పడింది. తమిళంలో అయితే హీరోయిన్లను బొద్దుగా చూడ్డానికే ఇష్టపడతారు. టాలీవుడ్‌లోనూ మరీ బక్కగా వుంటే ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ అవడం కష్టం. అయినాగానీ, ట్రెండ్ మరింది. ఇప్పుడంతా జీరో సైజ్ ఫిజిక్ అనే క్రేజ్ నడుస్తోంది. కీర్తిని జీరో సైజ్.. అని అనలేంగానీ, దానికి దగ్గరగానే వుంది. తాజాగా, కీర్తి సురేష్‌కి సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓనం సంబరాలకు సంబంధించిన ఫొటోలవి. ఆ ఫొటోల్లో కీర్తి లుక్ చూసి, ‘కాస్త బొద్దుగా మారితే మంచిదేమో..’ అని సలహాలిస్తున్నారట టాలీవుడ్, కోలీవుడ్‌లో సన్నిహితులు. కీర్తి మాత్రం, మళ్ళీ బొద్దుగా మారే ప్రసక్తే లేదని చెబుతోంది. అదేమని ప్రశ్నిస్తే, ‘నేను కంఫర్ట్‌గా వున్నాను..’ అంటోందిట. ఇక, షూటింగ్ నిమిత్తం కేరళ నుంచి హైద్రాబాద్ చేరుకుంది కీర్తి సురేష్. మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించనున్న కీర్తి సురేష్, మరికొన్ని సినిమాలతోనూ తెలుగులో చాలా చాలా బిజీగా వుంది. టాప్ హీరోయిన్.. అనే గుర్తింపు వున్నా, మరింత స్టార్‌డవ్‌ు కావాలంటే గ్లామర్ తప్పనిసరి.. కానీ, కీర్తి మాత్రం ‘గ్లామర్‌కి నో’ అని తెగేసి చెప్పేస్తోంది