iDreamPost
android-app
ios-app

Karate Kalyani-Srikanth నేను చేసింది త‌ప్ప‌యితే, క‌రాటే క‌ళ్యాణి చేసిందికూడా త‌ప్పే, నాకు ప్రాణహాని ఉంది. శ్రీకాంత్ రెడ్డి @ ప్రాంక్‌స్టార్

  • Published May 13, 2022 | 4:11 PM Updated Updated May 13, 2022 | 4:11 PM
Karate Kalyani-Srikanth నేను చేసింది త‌ప్ప‌యితే, క‌రాటే క‌ళ్యాణి చేసిందికూడా త‌ప్పే, నాకు ప్రాణహాని ఉంది. శ్రీకాంత్ రెడ్డి @ ప్రాంక్‌స్టార్

క‌రాటే కళ్యాణి , శ్రీకాంత్ రెడ్డిల మధ్య ఫైటింగ్ ఇష్యూ పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ వెళ్లింది. గురవారం రాత్రి కరాటే కళ్యాణి కొంత‌మందితో కలిసి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కొట్టారు. తిర‌గ‌బ‌డిన శ్రీకాంత్ రెడ్డి ఆమెను చెంప‌దెబ్బ కొట్టాడు. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేస్తుండగా, అతను కరాటే కళ్యాణిపై దాడి చేసి కిందపడేశాడు. ఇదంతా ముందుగా ప్లాన్ చేసుకొని, ఈ దాడిని మొత్తం తన ఫేస్ బుక్‌ లైవ్‌‌లో రికార్డ్ చేసింది కళ్యాణి.

శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ప్రాంక్ వీడియోలపై గట్టిగా నిలదీసింది కరాటే కళ్యాణి. అది కాస్తా శృతిమించ‌డంతో, గొడవ ముదిరింది. కొట్టుకొనే వ‌ర‌కు వెళ్లింది. ఇప్పుడు ఇద్ద‌రూ పోలీస్ స్టేష‌న్ ద‌గ్గ‌రున్నాయి.

కరాటే కళ్యాణి తనని డబ్బులు డిమాండ్ చేసిందని శ్రీకాంత్ రెడ్డి అంటే, అత‌నే త‌న‌ ప్రైవేట్ పార్ట్స్‌పై చేయివేశాడంటూ కరాటే కళ్యాణి ఆరోపించింది. లేటెస్ట్ గా, కరాటే కళ్యాణితో తనకి ప్రాణ హాని ఉందంటూ శ్రీకాంత్ రెడ్డి వీడియో విడుదల చేశాడు.

నేను చెసింది త‌ప్ప‌యితే, క‌రాటే క‌ళ్యాణి చేసిందికూడా త‌ప్పేనంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి. కళ్యాణి కూడా వ్యాంప్ పాత్రలు చేసింది, అవ‌న్నీ అడల్ట్ కంటెంట్ ఉన్న పాత్రలే . మీరు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పేంటని అడగాను. ఇది నా బతుకుతెరువు, నేనూ ఆర్టిస్ట్‌నే అని చెప్పాన‌ని మీడియాకి వెల్ల‌డించాడు శ్రీకాంత్ రెడ్డి .

రూ.లక్ష ఇవ్వు వదిలేస్తాను, లేదంటే నేను బీజేపీ లీడర్‌ని. హైదరాబాద్‌లో బతకనీయను అని బెదిరించింది. నేను ఒప్పుకోలేదు. నన్ను చెంపపై కొట్టింది, అయినా వదిలేశాను, మూడోసారి ఆమె కొట్టగానే నేను కొట్టాల్సి వచ్చింది. నేను వినోదం కోసమే ప్రాంక్ వీడియోలు చేస్తున్నా, పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా ఉఊ అని పాటలు చేస్తే తప్పులేదు. కరాటే కళ్యాణి కూడా వ్యాంప్ పాత్రలు చేసింది. నలుగురిలో నన్ను ఘోరంగా కొట్టారు. ఇది నా బ్రతుకుదెరువు. నేను బతుకుతూ కొంతమందికి ఆసరా ఇస్తున్నాన‌ని శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు.

ప్రాంక్ వీడియోలు చేసినా, ముందుగా స్క్రిప్ట్ ప్రకారమే చేస్తున్నాం. కరాటే కళ్యాణి నన్ను చంపేస్తా, రేప్ కేసులు పెట్టిస్తానంటుంది. స‌మాజ‌సేవ‌కురాలంట‌. ఆమె సమాజానికి ఏం చేసిందో నాకు తెలియదు. నా వీడియోలు చేయడం నచ్చకపోతే, చూడ‌కండి. నాపై ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. నాకు సపోర్ట్ చేయండ‌ని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ రెడ్డి.

మొత్తానికి క‌రాటే క‌ళ్యాణి, శ్రీకాంత్ రెడ్డిల మ‌ధ్య గొడ‌వ కాస్తా ర‌చ్చ‌కెక్కి, ఫ్రాంక్ వీడియోలు, సినిమాల్లోని అశ్లీల‌త‌ను మ‌రోసారి చ‌ర్చ‌కు పెట్టింది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş