iDreamPost
android-app
ios-app

అమెరికా లోని కన్సాస్ నగరంలో బతుకమ్మ సంబరాలు

  • Published Oct 17, 2018 | 5:31 AM Updated Updated Oct 17, 2018 | 5:31 AM
అమెరికా లోని కన్సాస్ నగరంలో బతుకమ్మ సంబరాలు

అమెరికా లోని కన్సాస్ నగరం లో తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటి ( TAGKC ) ఆద్వర్యం లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవాలి నార్త్ వెస్ట్ హైస్కూల్ లో జరిగిన ఈ వేడుకల లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వాఖ్యాత గా వ్యవహరించారు. సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్య తన మధురమైన పాటల తో ఊర్రూతలూగించారు. కాన్సస్ సిటి లోకల్ సింగర్ శ్రియ పొందుర్తి పాడిన పాటలు ఎంతో ఉత్సాహపరిచాయి. స్థానిక దేవాలయ పూజారి గారు నిర్వహించిన బతుకమ్మ మరియు అమ్మ వారి పూజ ల తో కార్యక్రమం అరంబం అయింది.ఆ తరువాత నగరం లోని తెలుగు వారు అందరు చక్కని సాంప్రదాయ వేష దారణ లో తము చేసిన బతుకమ్మలను తీసుకోని రావడంతో పండుగ వాతావరణం నెల కొంది. తెలంగాణ సాంస్కృతి ని ప్రతిబింబించే జానపద మరియు ఊయ్యాల పాటలకు ఆడవాళ్లు అంతా బతుకమ్మల చూట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతుంటె సంబరాలు అంబరాన్ని అంటాయి. కోలాటాలు మరియు చిన్నా పెద్దా అందరు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. బతుకమ్మలన్నింటి లో మంచి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలు నిర్ణయించి, వారికి స్పాన్సర్స్ ద్వారా బహుమతులు అంద చేసారు. ఆ తరువాత ఎంతో చక్కగా అందరు తమ తమ బతుకమ్మ లను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసి, ప్రసాదాలు పంచుకోని పండుగ పద్దతులన్ని చక్కగా చేసుకున్నారు. ఆ తరువాత ఎంతో సేపు యువతీ యువకులు గా ఆడి పాడి అనందించారు. ఈ సంబరాల లో చక్కని తెలుగు బోజనం హైలైట్ గా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికి TAGKC Executive Committe  ధన్యవాదాలు తెలిపింది.