iDreamPost
android-app
ios-app

Bimbisara : ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే, విజువల్ వండర్‌గా బింబిసార ట్రైలర్

  • Published Jul 04, 2022 | 7:49 PM Updated Updated Jul 21, 2022 | 3:20 PM
Bimbisara : ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే, విజువల్ వండర్‌గా బింబిసార ట్రైలర్

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ త‌ర‌హాలో ఇప్ప‌టిదాకా క‌నిపించ‌లేదు. ఆయ‌న సినిమా వ‌చ్చికూడా చాలా కాలమైంది. ఆయ‌న బింబిసార సినిమాలో రెండు కాలాల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నం క‌నిపించింది. బింబిసారుడు ఈ కాలంలోకి వ‌స్తే? ఈ సినిమాకు దర్శకుడు వాశిష్ట మల్లిడి. ఈ ద‌ర్శ‌కుడిని న‌మ్మ‌కి భారీగా పెట్టుబడం చాలామందికి అనుమానం రేకిత్తించింది. అనుకున్న‌ట్లుగా బింబిసార సినిమా వ‌స్తోందా?


రిలీజ్ అయిన‌ బింబిసార ట్రయిలర్ అనుమాల‌న్నింటిని పటాపంచలు చేసింది. రెండున్నర నిమషాలకు పైగా సాగిన ఈ ట్రయిలర్లో ఎమోష‌న్స్, యాక్ష‌న్, అంత‌కుమించి హిస్టారికల్ …చాలా ఎలిమెంట్స్ ఒక రేంజ్ లో పేలాయి. పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్ తో అటు బింబిసారుడు, ఇటు ఈ తరం హీరో కు లింక్ పెట్టారు. నిధి, ప్రపంచాధిప‌త్యం లాంటివి మిక్స్ చేశారు. క‌థ తెలిసిన‌ట్లే ఉన్నా, మేకింగ్, విజువల్స్, గ్రాఫిక్ అన్నీ మంచి రేంజ్ లో ఉన్నాయి.

కళ్యాణ్ రామ్ ది డబుల్ రోల్. బింబిసార లాంటి చారిత్ర‌క వ్య‌క్తికి కావాల్సిన బాడీలాంగ్వేజ్ క‌నిపించింది. కీరవాణికి ఇలాంటి సినిమాల మ్యూజిక్ కొట్టిన‌పిండే. అందుకే నేపథ్య సంగీతం కూడా అందుకు తగినట్లే ఉంది. సినిమాటోగ్రఫీ ఎగ్జైటింగ్ గా ఉంది. ఆగస్టు 5న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet