iDreamPost
android-app
ios-app

Bimbisara బింబిసార 2లో కొత్త ఆకర్షణలు

  • Published Aug 29, 2022 | 5:52 PM Updated Updated Dec 06, 2023 | 10:47 AM

ఒకే రోజు వచ్చిన సీతారామం ప్రభావం, ఆపై వారం విడుదలైన కార్తికేయ 2లు కనక లేకపోయి ఉంటే దీని స్థాయి ఇంకా పెరిగేదన్న మాట వాస్తవం.

ఒకే రోజు వచ్చిన సీతారామం ప్రభావం, ఆపై వారం విడుదలైన కార్తికేయ 2లు కనక లేకపోయి ఉంటే దీని స్థాయి ఇంకా పెరిగేదన్న మాట వాస్తవం.

Bimbisara బింబిసార 2లో కొత్త ఆకర్షణలు

కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార 2 ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తూనే ఉంది. ఒకే రోజు వచ్చిన సీతారామం ప్రభావం, ఆపై వారం విడుదలైన కార్తికేయ 2లు కనక లేకపోయి ఉంటే దీని స్థాయి ఇంకా పెరిగేదన్న మాట వాస్తవం. ఇప్పటిదాకా పాతిక రోజులకు గాను 37 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ కేవలం 16 కోట్లలోపే. అంటే కొన్నవాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ తో పండగ జరిగిందన్న మాట. ఇంకో పది రోజులు ఈజీగా డీసెంట్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటిటి ప్రీమియర్ సెప్టెంబర్ 9 లేదా 16న ఉండొచ్చనే వార్త బలంగా ప్రచారంలో ఉంది. ఒకవేళ వసూళ్ల కోసం వాయిదా వేస్తారేమో చూడాలి

ఇప్పుడు బింబిసార 2కి రంగం సిద్ధమవుతోంది. ఇందులో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్ ని కొత్తగా సృష్టించబోతున్నట్టు తెలిసింది. అయితే ఇది సీక్వెల్ కాదు. చక్రవర్తికి అతని తమ్ముడు దేవదత్తుడుకి మధ్య ఏం జరిగిందన్న పాయింట్ మీద దర్శకుడు వశిష్ట కొత్తగా రాసుకున్నారట. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాహుబలి ఫార్ములా. బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెంచబోతున్నట్టు తెలిసింది. అంతే కాదు ముందు నుంచి ప్రచారం జరిగినట్టు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఉండే అవకాశాలు లేవు. క్యాస్టింగ్ ని ఎక్కువగా జోడించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ లో సోసోగా నడిపించిన క్యాథరిన్ త్రెస్సాతో పాటు మరొక హీరోయిన్ ని ఇందులో భాగం చేయబోతున్నట్టు వినికిడి.
Bimbisara
కళ్యాణ్ రామే నిర్మాతగా వ్యవహరించబోతున్న బింబిసార 2 షూటింగ్ మొదలవ్వడానికి కొంత టైం పట్టేలా ఉంది. ఈలోగా ఆ మధ్య బ్రేక్ తీసుకున్న డెవిల్ పూర్తి చేయబోతున్నారు. ఇది ఎప్పుడో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్. ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ వల్ల మార్కెట్ పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే పనులు వేగవంతం చేయబోతున్నారు. కాకపోతే బింబిసారని ఆడియన్స్ ఎంత ఆదరించినా ఇదే జోష్ ని ఇంకో ఏడాది తర్వాతనో అంతకంటే ఎక్కువనో చూపిస్తారా అంటే అనుమానమే. మొత్తానికి కళ్యాణ్ రామ్ పోగొట్టుకున్న మార్కెట్ తిరిగి తెచ్చిన బింబిసార ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించిన వాళ్ళు తక్కువే

Jojobet GirişMadridbetMariobetmeritbetjojobet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetjojobet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş