iDreamPost
android-app
ios-app

హిట్ దర్శకుడితో యంగ్ టైగర్ ?

  • Published Dec 10, 2020 | 12:09 PM Updated Updated Dec 10, 2020 | 12:09 PM
హిట్ దర్శకుడితో యంగ్ టైగర్ ?

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా సెట్లో అడుగు పెట్టేస్తాడు. కాకపోతే అది ఎప్పుడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అసలు కరోనా రాకపోయి ఉంటే వచ్చే నెల రాజమౌళి సినిమా విడుదలకు రెడీ ఉండి మాటల మాంత్రికుడి ప్రాజెక్ట్ సగానికి పైగానే అయిపోయేది. కానీ ప్రపంచం మొత్తం ఎదురుకున్న మహమ్మారి కాబట్టి అందరికీ గ్యాప్ తప్పలేదు. అయితే జీవితంలో ఏ హీరోకైనా దొరికే ఇంతటి అరుదైన ఖాళీ సమయాన్ని తారక్ ఎక్కువ వృధా చేసుకోలేదు.. కథా చర్చలకు ఉపయోగించుకున్నాడు. దర్శకులను కలిశాడు.

తాజా అప్ డేట్ ప్రకారం ఈ ఏడాది టైటిల్ లోనే హిట్ పెట్టుకుని విశ్వక్ సేన్ తో సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను ఇటీవలే తారక్ కు ఒక లైన్ వినిపించాడట. ఇంప్రెస్ అయిన జూనియర్ ఫుల్ వెర్షన్ విన్నాక నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు వినికిడి. దిల్ రాజు నిర్మాతగా ఇది పట్టాలు ఎక్కవచ్చనే టాక్ ఉంది. శైలేష్ తండ్రికి రాజుతో ముందు నుంచి వ్యాపార సంబంధమైన పరిచయం ఉంది. ఆ కారణంగానే ఇదంతా జరిగినట్టు వినికిడి. తారక్ తో బృందావనం తో ఓ సూపర్ హిట్ రామయ్య వస్తావయ్యాతో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న దిల్ రాజు మళ్ళీ కాంబో సెట్ చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు.

శైలేష్ ప్రస్తుతం అడవి శేష్ ప్లాన్ చేసుకున్న హిట్ సీక్వెల్ తో పాటు దీని హింది రీమేక్ పనులు కూడా చూసుకుంటున్నాడు. విశ్వక్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటించబోతున్నాడు.చిన్న సక్సెస్ ఇతన్ని పెద్ద రేంజ్ కు తీసుకెళ్ళేలా ఉంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఊహించని విధంగా ఏకంగా మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ తెరమీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఆర్ఆర్ఆర్ కొమరం భీమ్ టీజర్ ఆ రేంజ్ లో సంచలనాలు రేపింది. మరి శైలేష్ నిజంగా అంత జాక్ పాట్ కొడతాడా వేచి చూడాలి మరి.