ఇప్పటికి వరకు వచ్చిన ట్రెండ్స్‌ను బట్టి హరియాణాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు. ఒకవేళ హంగ్ ఏర్పడితే జేజేపీ కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. తాత ఓం ప్రకాశ్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టిన దుష్యంత్.. ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో సత్తా చాటారు. పదికి పైగా స్థానాల్లో జేజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో జేజేపీని బుజ్జగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు మంతనాలు జరుపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే జేజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది.