iDreamPost
android-app
ios-app

కనకవర్షం కురిసింది – మొదటి వారం వసూళ్లు

  • Published Mar 18, 2021 | 9:28 AM Updated Updated Mar 18, 2021 | 9:28 AM
కనకవర్షం కురిసింది – మొదటి వారం వసూళ్లు

ఇదో అద్భుతమనే చెప్పాలి. జాతిరత్నాలు ట్రైలర్ చూశాక ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ అవుతుందని ప్రేక్షకులు అనుకున్నారే తప్ప ఏకంగా రికార్డులు సృష్టించే బ్లాక్ బస్టర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. ముఖ్యంగా శివరాత్రితో మొదలుకుని మొదటి నాలుగు రోజులు సంచలన వసూళ్లు రాబట్టిన జాతిరత్నాలు ఓవర్సీస్ లోనూ అంతే స్థాయిలో చెలరేగిపోతోంది. నవీన్ పోలిశెట్టి డిమాండ్ ఇప్పుడు ఏకంగా మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే దాకా వచ్చిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు అనుదీప్ కూడా ఇంచుమించు ఇదే తరహా సిచువేషన్ ని ఎదురుకుంటున్నాడు

మొత్తం ప్రపంచవ్యాప్తంగా జాతిరత్నాలు 27 కోట్ల 68 లక్షలకు పైగా షేర్ వసూలు చేయడం పెద్ద సెన్సేషన్. ఎక్కువ అంచనాలు ఉన్న శర్వానంద్ శ్రీకారం ఇందులో సగం కూడా తీసుకురాలేకపోయింది. ఇక గాలి సంపత్, రాబర్ట్ ల సంగతి సరేసరి. నైజామ్ లో సత్తా చాటుతున్న జాతరత్నాలు సీడెడ్ లోనూ షాక్ ఇచ్చే స్థాయిలో మూడు కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్లడం చిన్న విషయం కాదు. అధిక టికెట్ ధరలు. ఎక్కువ స్క్రీన్లు, బలమైన డిస్ట్రిబ్యూషన్ లాంటివేవీ లేకపోయినా ఈ స్థాయిలో రాబట్టుకోవడం మీడియం రేంజ్ నిర్మాతలకు కొండంత ధైర్యం ఇచ్చిందనే చెప్పాలి. ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :

ఏరియా  షేర్ 
నైజాం  10.85cr
సీడెడ్  2.79cr
ఉత్తరాంధ్ర  3.10cr
గుంటూరు  1.60cr
క్రిష్ణ  1.35cr
ఈస్ట్ గోదావరి  1.45cr
వెస్ట్ గోదావరి  1.22cr
నెల్లూరు  0.72cr
ఆంధ్ర+తెలంగాణా  23.08cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.17cr
ఓవర్సీస్ 3.42cr
ప్రపంచవ్యాప్తంగా 27.68cr

ఇదే స్పీడ్ ఇంకో రెండు వారాలు కొనసాగిస్తే మాత్రం మరిన్ని రికార్డులు బద్దలవుతాయి. రేపు మూడు సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో వాటికి వచ్చే టాక్ ని బట్టి జాతిరత్నాలు ఎంత స్లో అవుతుందనేది ఆధారపడి ఉంటుంది. అయినా అవి డిఫరెంట్ జానర్స్ కావడంతో కామెడీ పరంగా మళ్ళీ ఫస్ట్ ఛాయస్ ఇదే నిలిచినా ఆశ్చర్యం లేదు. 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న జాతిరత్నాలు ఇప్పటికే డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చేసింది. ఇది ఫైనల్ గా నాలుగింతలుగా మారినా ఆశ్చర్యం లేదు. స్క్రీన్ల కౌంట్ తగ్గినప్పటికీ శని ఆదివారాల్లో మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అది రేపు సాయంత్రానికి తేలిపోతుంది