iDreamPost
android-app
ios-app

Jagananna Vidya Deevena – Vasathi Deevena – ఈ రెండు పధకాలు.. యువత భవితకు జోడు చక్రాలు

  • Published Sep 17, 2021 | 8:17 AM Updated Updated Sep 17, 2021 | 8:17 AM
  • Published Sep 17, 2021 | 8:17 AMUpdated Sep 17, 2021 | 8:17 AM
Jagananna Vidya Deevena – Vasathi Deevena – ఈ రెండు పధకాలు.. యువత భవితకు జోడు చక్రాలు

నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు కొనసాగించాలనే సమున్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెనతో రాష్ట్రం విద్యా పరంగా దూసుకుపోతోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే పూర్తిగా ఫీజును రీఎంబర్స్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ఏ బకాయిలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది. ఆ డబ్బును వారే కాలేజీలో చెల్లించుకోవలసి ఉంటుంది.

పెద్ద చదువులు భారం కాకూడదని..

ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించవలసిన ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. సంవత్సరంలో నాలుగు విడతలుగా ఈ చెల్లింపులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికి రెండు విడతల చెల్లింపులు పూర్తి చేశారు. ఏప్రిల్ 19న తొలి విడత 671.45 కోట్లు, జులై 29న రెండో విడతలో 10.97 లక్షల మంది విద్యార్థులకు 693.81 కోట్లు చెల్లించారు. మూడో విడత డిసెంబర్లో, నాలుగో విడత 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా చెల్లింపులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తూ పేదలకు పెద్ద చదువులు భారం కాకుండా చర్యలు తీసుకుంది.

చేతులు దులుపుకున్న టీడీపీ..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ ఓ ఫార్సుగా నడిచింది. అరకొరగా సొమ్ము చెల్లించి చేతులు దులుపుకుంది. అదీ సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బంది పడేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం చెల్లించవలసిన 1,774.60 కోట్ల రూపాయల బకాయిలతో సహా రూ.4,207.85 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకు నేరుగా విద్యాదీవెన కింద రూ.5,573.11 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది.

ప్రభుత్వ ఉద్దేశం ఇదీ..

పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి ఆ ఫీజులు కట్టడం వల్ల అక్కడి సమస్యలు, సదుపాయాల గురించి తెలుసుకుంటారు. కాలేజీల్లో వసతుల లోపం ఉంటే యాజమాన్యాన్ని ప్రశ్నించగలుగుతారు. అయినా అవి పరిష్కారం కాకపోతే 1902 నంబరుకు ఫోన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవచ్చు. అప్పుడు ప్రభుత్వం ఆ కాలేజీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.

Also Read : సీఎం జగన్‌ గురించి అగ్రిగోల్డు బాధితులు ఏమనుకుంటున్నారు..?

కాలేజీల్లో జవాబుదారీతనం, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేందుకే ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కాలేజీలకు కాకుండా తల్లుల ఖాతాలకు జమ చేస్తోంది. ఖాతాలో సొమ్ము జమ చేసిన వారం, పది రోజుల్లో కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే తదుపరి విడత నిలుపు చేస్తారు. ఈ నిబంధన వల్ల తల్లితండ్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా తమ పిల్లలను చదివించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

జగనన్న వసతి దీవెన కూడా..

పూర్తిగా ఫీజును రీఎంబర్స్ చేసే విద్యాదీవెనకు తోడుగా ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కూడా అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో వసతి, భోజన ఖర్చుల నిమిత్తం విద్యార్థులకు సొమ్ము చెల్లిస్తారు. ఐటీఐ చదివేవారికి రూ. పదివేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వర్తిస్తుంది. నేరుగా తల్లుల ఖాతాలోనే సొమ్మును జమ చేస్తారు.

ఇచ్చిన మాట ప్రకారం

పేద పిల్లల మేనమామలా వారి చదువుల బాధ్యత తాను తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహనరెడ్డి మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రెండు పథకాలకు మరో నాలుగు జోడించి చిత్తశుద్ధితో అమలు చేస్తూ విద్యారంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.

విపక్షం అర్థంలేని విమర్శలు చేసీనా, వ్యతిరేక మీడియా అదే పనిగా తప్పుడు కథనాలు రాస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతోంది. ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలి మెట్టు అని నమ్మిన జగన్మోహనరెడ్డి అది సాకారం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నారు.

Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss