iDreamPost
android-app
ios-app

జగన్ అసలు నైజం ఇదే

జగన్ అసలు నైజం ఇదే

ప్రభుత్వం అంటే పెత్తనం చేసేది కాదు.. పెత్తనం చేసేవాడు పాలకుడు కాదు. రాజ్యం (ప్రజలు) నిర్ణయించిన మంచి చెడులను, నియమ నిబంధనల ఆధారంగా ప్రజలకు అవసమైన పనులు చేస్తూ ప్రజల మన్నలను పొడేవాడే అసలైన రాజు. దేశంలో ప్రజల మన్ననలు పొందేలా పాలన చేసేందుకు 30, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతలు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యం లో అలాంటి వారి అనుభవము అంత వయస్సు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్నారు. ఎవరూ చేయలేనిది చేస్తేనే ఎవరికైనా గుర్తింపు వస్తుంది. ఇలాంటి  గుర్తింపునే జగన్ సంపాదిస్తున్నాడు. ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా దేశంలో రెండు విభిన్న ప్రాంతాలలోని రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ఆయా పాలకుల వ్యవహార  శైలిని ప్రజలకు పరిచయం చేసింది. 

పరిపాలన అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంటుందన్న విషయం జగద్వితమే. ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒక రాష్ట్రం లోని పాలకుడు ఉన్నఉద్యోగాలను తొలగిస్తే… ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం సరిలేని మరొక  రాష్ట్ర పాలకుడు అంతకు మించి 5 రెట్లు ఉద్యోగాలను సృష్టించి ఇచ్చారు. ఈ నిర్ణయాలకు వేదికగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. రెండు నిర్ణయాలు ఒకేసారి జరగడం యాదృచ్చికం. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పని చేస్తున్న 25 వేల మంది హోమ్ గార్డులను ఉద్యోగాల నుంచి అర్ధాంతరంగా తొలగించింది. ఇక మిగిలి ఉన్న 99 వేళా మంది హోమ్ గార్డ్ ల నెల పని దినాలు సగానికి (15 రోజులు) తగ్గించింది. 

ఇదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హోమ్ గార్డ్ల జీతాలను పెంచింది. రోజుకు రూ. 600 ఉన్న మొత్తాన్ని రూ. 710లకు పెంచింది. ఆర్ధిక పరమైన కారణాలు చెప్పి ఉత్తర ప్రదేశ్ సీఎం ఉద్యోగులను తలగించగా.. అప్పులు, రెవెన్యూ లోటు ఉన్న కూడా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ అదే రంగానికి చెందిన ఉద్యోగాలకు జీతాలు పెంచడం పరకాల సంక్షేమం పట్ల అయన నైజాన్ని తెలియజేస్తోంది.