iDreamPost
android-app
ios-app

వ్యక్తిగత హాజరు నుంచి ముఖ్యమంత్రికి ఎందుకు మినహాయింపు ఇవ్వరు?

వ్యక్తిగత హాజరు నుంచి ముఖ్యమంత్రికి ఎందుకు మినహాయింపు ఇవ్వరు?

జగన్ విచారణ ఆపమని అడుగలేదు, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చి విచారణ కొనసాగిస్తూ, కోర్ట్ తన వ్యక్తిగత హాజరు ఎప్పుడు అవసరమని భావిస్తే అప్పుడు తప్పకుండ వస్తానన్నాడు. ఆ మినహాయింపు అడుగుతున్నది తన వ్యక్తిగత వ్యాపారాలు చూసుకోవటానికో, విదేశీ పర్యటనలకో కాదు కదా.

ఈ కేసులు విచారణనెదుర్కొంటూ , ప్రతివారం కోర్టుకు హాజరౌతూ, ప్రజల దగ్గరకు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నన్ను, మాపార్టీని గెలిపించండి అని ప్రజల వద్దకు వెళ్లి ప్రజా తీర్పుకోరాడు. ప్రజలు మీరు మమ్మల్ని పాలించే అర్హత ఉన్నదని విస్పష్టంగా తీర్పు చెప్పారు. ఇప్పుడు ఆ ప్రజల భవిష్యత్తుకు ప్రధాన బాధ్యుడు ముఖ్యమంత్రి. ఒక చిన్న ఉద్యోగి లేదా వ్యాపారస్తుడు వారములో ఒక రోజు తమ విధులకు గైర్హాజరైతే ఆ సంస్థకు ఎంత ఇబ్బంది, నష్టమో తెలియదా. అలాంటిది 5 కోట్ల ప్రజలకు ప్రస్తుత, భవిష్యత్తవసరాలను చూసుకోవలసిన ముఖ్యమంత్రి తన విధులకు వారములో ఒక రోజు హాజరు కాకుంటే నష్టమెంతో తెలియదా. ఆ నష్టపోయేదెవరు 5 కోట్ల మంది ప్రజలు కాదా?

ఒక వాదన చెయ్యవచ్చు మరి కేసులున్న వాళ్ళను ముఖ్యమంత్రిగా ఎవ్వరు ఎన్నుకోమన్నారు అని.

దానికి సమాధానం ప్రజలకు ఇవన్నీ తెలిసే తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రశ్న వేసేవారు IMG భారత కేసులో సిబిఐ , ఈ రాష్ట్ర కోర్టులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఎలా వ్యవహరించారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. CBN మీద ప్రాథమిక విచారణ జరుపమని హై కోర్ట్ తీర్పు ఇస్తే జగన్ కేసులో వారంలోనే పదుల సంఖ్యలో తమ బృందాలతో విచారణ మొదలుపెట్టి తమ నివేదికను సమర్పించిన CBI అధికారే, CBN దగ్గరికొచ్చేసరికి మౌనం దాల్చి మొహం తిప్పేసినదీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తరువాత నాట్ బిఫోర్ మీ లాంటి ఉపయోగించుకొని వ్యవస్థలనుండి ఎలా తప్పించుకొన్నదీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. సుజనా కేసులో ఏమిజరిగిందీ, జరుగుతున్నదీ ప్రజలకు తెలుసు. ఇవన్నీ చూసారు కాబట్టే ప్రజలు తమ ఇంగితాన్ని ఉపయోగించి తమ తీర్పు వెలువరించారు. వారి తీర్పు సమంజసమే అనే విధముగా రాష్ట్రములో అవినీతిని నిరోధించటానికి తీసుకుంటూన్న చర్యలు పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులలో రివర్స్ టెండర్ ద్వారా మిగిలిన ప్రజాధనం, మద్యపాన నిషేదానికి తీసుకుంటూన్న చర్యలు, ప్రజాధనాన్ని దుబారా చేయకపోవటం, విద్యావ్యవస్థ మెరుగుకు తీసుకుంటున్న చర్యలు, కోర్ట్ కూడా తీర్చ లేకపోయినా అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారము దిశగా పడుతున్న అడుగులు తెలియజేస్తున్నాయి.

జగన్ పై కేసులు తేలేవరకు ఆయనకు ముఖ్యమంత్రిగా పాలించే అర్హత రాజ్యాంగబద్హంగా ప్రజాతీర్పుతో కలిగింది. అంతవరకు ఆయన పనిని ఆయన చేసుకోనివ్వటం ప్రజకు అవసరం. అలాగని ఆ విచారణను ఆపమని ఎవ్వరూ కోరటం లేదు కదా.

వ్యవస్థలకు సర్వకాలలో సర్వ జనులపట్ల ఒకే విధానాన్ని అనుసరించవలసిన బాధ్యత ఉంది. అలా ఉంటె అప్పుడు ఈ వ్యవస్థలపై అపనమ్మకాలు కలుగవు. ప్రజల భావన, వ్యవస్థల భావన పరస్పరవిరుద్ధంగా ఉండదు.

Gopal Lingireddy