iDreamPost
android-app
ios-app

కామెడీ షోలుచాలు, ఇక‌పై సినిమాలు,వెబ్ సిరీస్ లే!

  • Published Jun 30, 2022 | 5:42 PM Updated Updated Jun 30, 2022 | 5:44 PM
కామెడీ షోలుచాలు, ఇక‌పై సినిమాలు,వెబ్ సిరీస్ లే!

స్టార్ యాంక‌ర్ అన‌సూయ కెరీర్ ప‌రంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టిదాకా ఎన్నిసినిమాలు చేసినా, జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గానే కొన‌సాగ‌డానికి ఇష్ట‌ప‌డ్డారు. డేట్స్ క్లాష్ రాకుండా చూసుకున్నారు. అందుకే ఆచితూచి సినిమాలు చేశారు. కాని ఏ ఒక్క‌రోజుకూడా జ‌బర్ధ‌స్త్ షోను మిస్ కాకుండా ప్ర‌య‌త్నించారు. త‌న గ్లామ‌ర్ తో జ‌బ‌ర్ధ‌స్త్ రేంజ్ ను పెంచారు. అలాంటి కామెడీ షోను ఆమె విడిచిపెట్టారు.

సినిమాల రేంజ్ పెరిగింది. వెబ్ సీరీస్ ల‌తో నేష‌న‌ల్ వైడ్ పాపులారిటీ సాధిస్తున్నారు. ఇప్ప‌టిదాకా స‌గం జ‌బ‌ర్ధ‌స్, స‌గం సినిమా అనుకున్న అన‌సూయ‌, ఇప్పుడు సినిమాల మీద‌నే ఫోకస్ చేయ‌నున్నారు. ఈ స్టార్ యాంక‌ర్ చేతిలో, పాన్ ఇండియా సినిమా మొద‌లు, సౌత్ సినిమాలు మూడు ఉన్నాయి.

ఇప్పుడు ఆమె స్టార్ మా కోసం రెండు షోలకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయినా సినిమాల‌కే ప్రాధాన్య‌త‌. లేటెస్ట్ గా రెండు తమిళ సినిమాలు , మలయాళ సినిమాకు సైన్ చూశారు. ఆమె పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ పుప్షా 2 లో ఆమె పాత్ర మ‌రింత పెర‌గ‌నుంది. ఆమె కేర‌క్ట‌ర్ రంగ‌మ్మ‌త్త‌ను మించిపోతుంద‌న్న‌ది టాక్.

అనసూయ వ‌య‌స్సు 40కి ద‌గ్గ‌ర‌గా ఉంది కాబ‌ట్టి, కామెడీ షోల‌కు, సినిమా ప్రొగ్రామ్ ల‌కు హోస్ట్ గా ఆమె ఎంత‌కాలం కొన‌సాగాల‌నుకోవ‌డంలేదు. సినిమాల్లో ఆమె కెరీర్ గేర్ మార్చేందుకు ట్రైచేస్తున్నారు. మంచి కేర‌క్ట‌ర్ ప‌డ‌లేకాని సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో ఆమె పెర్ ఫార్మెన్స్ ఏం రేంజ్ లో ఉంటుందో టాలీవుడ్ కి తెలుసు. అందుకే ఆమె కామెడీ, టీవీ షోల‌కు బ‌దులు సినిమాలు, వెబ్ సీరీస్ లో బిజీ కానున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet