iDreamPost
android-app
ios-app

సినిమా హాళ్లు తెరిచినందుకే టెన్షన్ వచ్చిందా

  • Published Aug 11, 2021 | 6:12 AM Updated Updated Aug 11, 2021 | 6:12 AM
సినిమా హాళ్లు తెరిచినందుకే టెన్షన్ వచ్చిందా

ఈ వారాంతంలో డైరెక్ట్ ఓటిటిలో వస్తుందని ప్రచారం జరిగిన నితిన్ కొత్త సినిమా మాస్ట్రో ఏ సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉంది. మొన్నో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు కానీ దానికి సంబంధించి ఎలాంటి హంగామా కనిపించలేదు. పైగా టీమ్ కు సంబంధించి ఎవరూ దాని గురించి స్పెషల్ గా చెప్పడం ట్వీట్లు వేయడం చేయలేదు. అసలు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉందాని నితిన్ అభిమానులు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం థియేటర్లు తెరుచుకోవడమేనని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే ఇప్పుడు జనం హాళ్లకు వస్తున్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓపెనింగ్స్ తో క్లారిటీ వచ్చింది. కానీ అందరికీ ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి.

ఇప్పుడు ఓటిటి రిలీజ్ అంటూ ముందు నుంచి హడావిడి చేస్తే డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యతిరేకత, ఇతర స్టేట్ మెంట్లు గట్రా వస్తాయని భావించిన యూనిట్ అందుకే మౌనంగా ఉందని తెలిసింది. డిస్నీ హాట్ స్టార్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కాబట్టి నారప్ప టైపులో కేవలం ఒక నాలుగైదు రోజులు ముందు మాత్రమే ప్రమోషన్లు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆల్రెడీ డీల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా లేదని తెలిసింది. ఎందుకొచ్చిన గొడవ లెమ్మని మాస్ట్రో టీమ్ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉండటం అనే ఆప్షన్ ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది

థియేటర్ల వద్ద ఎస్ఆర్ కళ్యాణ మండపం మొదటి వారం ఎంత సత్తా చాటినా ఇమేజ్ ఉన్న హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వచ్చి కనీసం ఓ రెండు వారాలు స్ట్రాంగ్ రన్ చూపించగలిగితే అప్పుడు కలెక్షన్ల మీద నమ్మకం పెట్టుకోవచ్చు. అందుకే టక్ జగదీష్ ముందు ఓటిటికి ఓకే చెప్పేసింది. అయితే ఇప్పుడేదో మళ్ళీ థియేటర్ అంటున్నారు కానీ నిర్మాతల వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఏడాది రంగ్ దే, చెక్ రూపంలో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన నితిన్ కు మాస్ట్రో సక్సెస్ చాలా ముఖ్యం. ఓటిటినే కాబట్టి ఇందులో సినిమా రేంజ్ ని డిసైడ్ చేయడం కష్టం కానీ ఊహించని స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కావడం మాత్రం ఖాయం

Also Read : థియేటర్లకు అంతేసి జనం రాగలరా

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler