iDreamPost
android-app
ios-app

ఇద్దరు భార్యల సరదా అల్లరి – Nostalgia

  • Published Nov 15, 2020 | 10:16 AM Updated Updated Nov 15, 2020 | 10:16 AM
ఇద్దరు భార్యల సరదా అల్లరి – Nostalgia

భారతీయ సమాజంలో కొన్ని మతాల్లో మినహాయించి బహు భార్యత్వం చట్టరిత్యా నేరం. జైలు శిక్ష కూడా పడుతుంది. అందుకే పలు రుచులు కోరుకునే మగాళ్లు సీక్రెట్ గా తమ చిన్నిళ్ళను మైంటైన్ చేయడం అన్ని చోట్లా ఉన్నదే. ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలానే వచ్చాయి కానీ అందులో ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించినవి తక్కువే. ఒకప్పుడు శోభన్ బాబు, జగపతిబాబు ఇలాంటి కథలకు బ్రాండ్ అంబాసడర్స్ గా ఉండేవాళ్ళు. స్టార్ హీరోలు మాత్రం వీటిని చేసిన దాఖలాలు అరుదు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మూవీ 1996లో విడుదలైన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. దాని విశేషాలు చూద్దాం.

1995లో తమిళంలో భాగ్యరాజా కథను అందించగా మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్, ఊర్వశి, వినయప్రసాద్ ప్రధాన పాత్రల్లో ‘తాయ్ కులమే తాయ్ కులమే’ అనే సినిమా వచ్చింది. పెద్ద తారలు లేకపోయినా సూపర్ సక్సెస్ అయ్యింది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డా కెఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి. అప్పటికే వెంకటేష్ తో క్షణక్షణం నిర్మించిన ఈ బ్యానర్ లో అనగానే వెంకీ ఎక్కువ ఆలోచించలేదు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అప్పటికే వెంకీతో అబ్బాయిగారు లాంటి సూపర్ హిట్ రీమేక్ ని అందించిన ఈవివి సత్యనారాయణ దర్శకుడిగా కోటి సంగీతం అందించగా ఇసుకపల్లి మోహనరావు రచనలో ఇండియా, నేపాల్ లొకేషన్లలో ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించారు.

హీరోయిన్లుగా సౌందర్య, వినీత ఫిక్స్ అవ్వగా కోట, ఏవిఎస్, బ్రహ్మానందం, బాబూమోహన్ తదితరులు ఇతర కీలక పాత్రలకు ఎంపికయ్యారు. పిల్లలు పుట్టే అవకాశం లేని భార్యతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న హీరో వేరే దేశం వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డను కనే కాన్సెప్ట్ తో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ కలగలసి ఎలాంటి అశ్లీలత లేకుండా ఈవివి బెస్ట్ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చిదిద్దారు. మొదట్లో ఇలాంటి టైటిల్ తో వెంకటేష్ సినిమా చేయడం ఏమిటనే కామెంట్స్ వచ్చినప్పటికీ రిలీజయ్యాక అవన్నీ సైలెంట్ అయ్యాయి. దిగ్విజయంగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వందరోజులు పూర్తి చేసుకుంది. ఆ టైంలో భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్న వెంకీ ఫ్యాన్స్ కు సంతోషాన్ని పంచింది