iDreamPost
android-app
ios-app

నా తప్పేం లేదంటున్న మెహ్రీన్

  • Published Feb 25, 2020 | 3:31 AM Updated Updated Feb 25, 2020 | 3:31 AM
  • Published Feb 25, 2020 | 3:31 AMUpdated Feb 25, 2020 | 3:31 AM
నా తప్పేం లేదంటున్న మెహ్రీన్

ఇవాళ కొన్ని మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో హీరోయిన్ మెహ్రీన్ ఖర్చుల గురించి అశ్వద్ధామ షూటింగ్ సమయంలో, ప్రమోషన్ టైంలో తన వ్యవహార శైలి గురించి కొన్ని కథనాలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఖరీదైన హోటల్ లో విడిది ఏర్పాటు చేస్తే ఫుడ్డు, హెయిర్ స్టైలింగ్ పేరు మీద లక్షల కొద్ది బిల్లు వేసి మేహ్రీన్ టీం వసూలు చేసుకుందని అంతేకాక ప్రచార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మెహ్రీన్ ట్విట్టర్ ద్వారా స్పందించింది.

ఇప్పటిదాకా తెలుగులో 14 సినిమాల్లో నటించానని ఎప్పుడు రాని రిమార్క్ ఇప్పుడు ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని అందులో పేర్కొంది. తన నాన్నమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చి స్టంట్స్ వేసిన సమయంలో తాను అందుబాటులో లేని మాట వాస్తవమేనని ఇదే విషయాన్నీ హీరో నాగ శౌర్య ఇంటర్వ్యూలో పేర్కొనడం మర్చిపోరాదని గుర్తుచేసింది. మరో సంఘటనను ఉదాహరిస్తూ ఓసారి ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చినప్పుడు మొహం మీద పొక్కులతో స్కిన్ అలర్జి వచ్చిందని పేర్కొంది.

దానికి సంబంధించిన ఫోటోతో పాటు మెడికల్ రిపోర్ట్ ని అశ్వద్ధామ నిర్మాతకు పంపించానని అయినా తన మీద అనవసరంగా అబాండాలు వేస్తూ మచ్చ తెచ్చేలా సదరు సైట్లో కథనాలు రావడం విచారకరమని అందులో పేర్కొంది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతున్నందునే ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చిందని ఇకపై దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్ ఉండదని కుండ బద్దలు కొట్టేసింది. సందేశం చివర్లో ఐరా సంస్థ భవిష్యత్తు చిత్రాలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగించింది. మొత్తానికి మెహ్రీన్ ఇలా పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ మీద సుదీర్ఘ సందేశం పెట్టాల్సి వచ్చిందంటే ఆ కథనం చాలా దూరం వెళ్ళినట్టే కనిపిస్తోంది. అశ్వద్ధామతో పాటు మెహ్రీన్ చేసిన ఎంత మంచివాడవురా కొత్త ఏడాదిలో ఆశించిన ఫలితం అందుకోలేదు. అదే బాధ అనుకుంటే ఇప్పుడీ వివాదం కొత్త రచ్చ చేసింది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet