iDreamPost
android-app
ios-app

కొత్త కెప్టెన్ సోహైల్ – ముగిసిన హోటల్ హల్చల్

  • Published Oct 09, 2020 | 6:05 AM Updated Updated Oct 09, 2020 | 6:05 AM
కొత్త కెప్టెన్ సోహైల్ – ముగిసిన హోటల్ హల్చల్

మూడు రోజులు సాగదీసిన బిగ్ బాస్ 4 హోటల్ టాస్క్ ఎట్టకేలకు ముగిసింది. అతిధుల టీందే పైచేయి అయ్యింది. సరైన సహకారం లేకపోవడంతో పాటు అవినాష్ రహస్యంగా ప్లే చేసిన ట్రిక్కులు హోటల్ బృందానికి చాలా డ్యామేజ్ చేశాయి. 5 స్టార్ట్ రేటింగ్ తెచ్చుకోవడంలో విఫలమయ్యాయి. అభిజిత్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ఇదయ్యాక తమలో బెస్ట్ ప్లేయర్ ని ఎంచుకోమని బిగ్ బాస్ సభ్యులను ఆదేశించాడు. అయితే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడంతో పక్కవాళ్ళను గెలిపించడానికి ఇష్టపడలేదు. తనకు మెహబూబ్ మద్దతు ఇస్తాడని ఆశించిన సోహైల్ కు నిరాశే మిగిలింది.

కాయిన్ గేమ్ తాను సహాయం చేసినందుకు ఇప్పుడిలా బదులు తీర్చుకుంటాడేమో అని చూస్తే అది జరగలేదు. కొంత డ్రామా అయ్యాక సోహైల్ ని కెప్టెన్ ఫస్ట్ ఆప్షన్ గా ఎన్నుకున్నారు. మిగిలిన వాళ్ళను ఎన్నుకునే క్రమంలో పార్టిసిపెంట్స్ అందరికి బిగ్ బాస్ తలా కొంత సొమ్ము ముట్టజెప్పాడు. ఫ్రెష్ గా టిప్పులు ఇవ్వొచ్చని చెప్పాడు. అంతా అయ్యాక లెక్క వేసుకుని చూసుకుంటే అందరి కంటే అఖిల్ దగ్గర ఎక్కువ డబ్బులు మిగలడంతో తను రెండో కాంటెస్టెంట్ గా నిలిచాడు. ఇక అవినాష్ వేసిన ఎత్తులు పైఎత్తులు, తన టీంకు తెలియకుండా ప్లే చేసిన డబుల్ క్రాస్ గేమ్ బాగా వర్కౌట్ అవ్వడంతో ఇతను మూడో వాడిగా నిలిచాడు. ఎవరికి తెలియకుండా వెన్నుపోటు పొడిచినందుకు ఇది కానుకన్న మాట.

ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరిని ఎంచుకోవడానికి ఓ వెరైటీ కాంటెస్ట్ పెట్టారు. కాళ్ళు బార్లా చాపుకుని చేతిలో చల్లని ఐసు గడ్డలు పట్టుకుని వంగి నిలుచుకున్న పొజిషన్ లో కింద పెట్టిన కాలే బొగ్గుల సెగలను తట్టుకుని ఎవరైతే ఎక్కువ సేపు నిలబడతారో వాళ్ళే విజేతలుగా చెప్పారు. అయితే అనూహ్యంగా ఇందులో అఖిల్ ముందుగా చేతులు ఎత్తేయగా సోహైల్ బాధను బిగబట్టుకుని మరీ విన్నర్ గా మిగిలాడు. దీంతో కొత్త కెప్టెన్ గా అతనికే పట్టం కట్టాడు బిగ్ బాస్. ఇదంతా అయ్యాక కాసేపు సరదాయణం కూడా నడిచింది. అవినాష్, దివి, గంగవ్వల మధ్య కాసేపు కామెడీ డ్రామా జరిగింది. మొత్తానికి ఈ షోని సీరియస్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఓ మోస్తరు ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న బిగ్ బాస్ విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించబోతోంది. రేపు నాగార్జున ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి మళ్ళీ ఎలిమినేషన్ వైపు సాగుతోంది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet