కొత్తగా కార్ కొన్న సు శ్రీ గారు డ్రైవింగ్ అలవాటు లేక కళాసాగర్ ని డ్రైవర్ గా పెట్టుకున్నారు . ఓ ఆదివారం మధ్యాహ్నమ్ కళా శివ అమెరికా నుండి వస్తున్నాడు . స్టేషన్ కెళ్ళి తీస్కొని రా అని పురామాయింపు .
సరే అని స్టేషన్ కి వెళ్తూ మధ్యలో ఆలయం కనపడితే కాస్త తీర్ధంతో దాహం తీర్చుకొని డిపో కెళ్ళి శివ గార్ని ఎక్కించుకొని ఇంటికి చేరేసరికి సు శ్రీ గారు తమ్ముడి మీద ప్రేమతో వాకిట్లో నుంచుని హారతి రెడీగా పట్టుకొని కుడి కాలు ముందు పెట్టి దిగు తమ్ముడూ అంటూ డోర్ తీసి చూద్దురు కదా .
లోపల చెమటలు పట్టి గడ గడా వణుకుతున్న శివ అన్న కనపడ్డాడు . ఏమడిగినా వులుకు పలుకు లేక బిత్తర చూపులు చూస్తున్నాడు .
————–
“ఎం కళా ఏమైంది శివా అలా బెదిరిపోయాడు”.
“ఫ్రంట్ లెఫ్ట్ పంచర్ ఐంది సర్ చూసి భయపడ్డారు “.
“టౌన్ లో పంచర్ ఏంటి ఎమెక్కించావ్ “.
“రమ్ బాటిల్ ఎక్కే సరికి గాజు గుచ్చుకొంది”.
“కళ్ళు కనపడట్లా బాటిల్ ఎలా ఎక్కించావ్” .
” అది కోటు జేబులో ఉంటే ఎలా కనపడుద్ది సర్”
“కోటు జేబులో ఉండటమెంట్రా కారు కోటు మీద ఎక్కిందా”?
“కాదు కోటు వేసుకున్నోడు అడ్డమొచ్చాడు వాడి మీద ఎక్కింది” .
“@#$%^& . హార్న్ కొట్టలేదా . వాడికేమైంది”
సౌండ్ పొల్యూషన్ వద్దని శివన్న హార్న్ కొట్టొద్దు అని అన్నాడు కదాని హార్న్ కొట్టలేదు . కోటులో వాడికేమైందో కానీ టైర్ ఎక్కినాక ఏమి మాట్లాడట్లేదు ఎందుకైనా మంచిదని డిక్కీ లో వేసుకొచ్చా మీరే చూడండి .
గు గా : @#$%^&*$#^:^^:&#&@%%’:&