iDreamPost
android-app
ios-app

అక్షయ్, కాస్త బ్రేక్ ఇవ్వు. మ‌రో బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రీలీజ్ తో హీరోని ట్రోల్ చేస్తున్న‌ ఫ్యాన్స్

  • Published Jul 10, 2022 | 11:40 AM Updated Updated Jul 10, 2022 | 11:40 AM
అక్షయ్, కాస్త బ్రేక్ ఇవ్వు. మ‌రో బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రీలీజ్ తో హీరోని ట్రోల్ చేస్తున్న‌ ఫ్యాన్స్

అక్ష‌య్ కుమార్(Akshay Kumar), మూడునెల‌ల‌కో సినిమా అన్న లెక్క‌లోనే, సినిమాలు లాగించేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ త‌ర్వాత‌, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్షయ్ కుమార్ మ‌రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఇదికూడా బ‌యోపిక్. మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా సినిమా తీర్చిదిద్ద‌నున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పంజాబీకి చెందిన జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో కనిపించనున్నాడు.

అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ లీక్ అయ్యింది, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, ఈ రక్షా బంధన్ హీరో, చారల లేత నీలిరంగు చొక్కా, తలపాగాతో, ఆవాల పొలం మధ్యలో నిలబడిఉన్నాడు.

మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ లా కళ్ళజోడుతో పాటు, పాత్ర కోసం సాధారణ పంజాబీ మ‌గాడిలా పెరిగిన‌ గడ్డంతో అక్ష‌య్ క‌నిపిస్తున్నాడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, రుస్తుం డైరెక్ట‌ర్ టీను సురేష్ దేశాయ్ ( Tinu Suresh Desai) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరుపెట్ట‌లేదు.

పంజాబీ హీరో పాత్ర‌ను అక్ష‌య్ పోషిస్తున్నందుకు కొంద‌రు అభిమానులు, పాజిటీవ్ గా రెస్పాన్డ్ అవుతుంటే, సామ్రాట్ పృథ్వీరాజ్ , బచ్చన్ పాండే ఫ్లాప్ ల త‌ర్వాత ఎందుకింత తొంద‌ర‌? మ‌రో సినిమాను చుట్టేస్తున్నావా అని, మ‌రికొంద‌రు ఫ్యాన్స్ నెగిటీవ్ గా స్పందిస్తున్నారు.

ఒక యూజ‌ర్ అయితే, అక్ష‌య్ కుమార్ సినిమాలు రిలీజైయ్యే టైంక‌న్నా, మ్యాగీని రెడీ చేయ‌డానికే ఎక్కువ స‌మ‌యం ప‌డుతోంద‌ని సెటైర్ వేశాడు.


సినిమా బాగుంటే అది 5 నిమిషాల్లోనే మీకు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది,. నేను సామ్రాట్ పృథ్వీరాజ్‌ని 15 నిమిషాలు అమెజాన్ ప్రైమ్‌లో చూశాను. ఇదో టైం వేస్ట్ అని మ‌రో ఫ్యాన్ కాస్త క‌ఠినంగా చెప్పాడు. మ‌రి ఈ కొత్త బ‌యోపిక్ అలాంటి సినిమాయే అవుతుందా? చాలామందికి డౌట్.

ఈ సినిమాల దండ‌యాత్ర‌తో అక్షయ్ ఫ్యాన్స్ విసిగిపోతున్నారు. కాస్త బ్రేక్ ఇవ్వొచ్చుగా, ఇదీ హీరోకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş