గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. బ్యాలెట్ ఓట్లు కావడంతో లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటి వరకు 50 డివిజన్లకు సంబంధించిన తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్‌ఎస్ 30, బీజేపీ 12, ఎంఐఎం 7 ,కాంగ్రెస్ 1 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
పటాన్‌చెరువు, రామచంద్రాపురం, ఓల్ట్‌మలక్‌పేట, సరూర్ నగర్, జూబ్లిహిల్స్, పటాన్ చెరువు, కాప్రా, బీఎన్ రెడ్డి నగర్, హైదర్‌గనర్, చర్లపల్లి, షేర్‌పేట, రామకృష్ణాపురం, షేర్‌లింగంపల్లి, హఫీజ్‌పేట, చందానగర్, బాలానగర్, రంగారెడ్డి నగర్, గాజుల రామారం తదితర డివిజన్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యంల ఉంది. చైతన్యపురి, గడ్డి అన్నారం, వనస్తలిపురం, హస్తినాపురం, లింగోజీగూడ, ఐఎస్ సదన్ డివిజన్లలో బీజేపీ, కూర్మగూడ, కిషన్ బాగ్ తదితర డివిజన్లలో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.