జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. మొదటి ఫలితం వెలువడిన మెహదీపట్నం నుంచి వెలువడగా అది ఎంఐఎం ఖాతాలో పడింది.
ఇక రాజకీయంగా వెనకబడిందనుకున్న కాంగ్రెస్ కూడా బోణీ కొట్టింది. ఉప్పల్ నియోజకవర్గంలోని ఏఎస్ రావు నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి శిరీషా రెడ్డి ఆ పార్టీకి తొలి గెలుపును అందించింది.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రోత్సకహంతోనే శిరీషా రెడ్డికి టికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పావని రెడ్డిపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదేమైనా.. శిరీషా రెడ్డి గెలుపు తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో గెలవడాన్ని ఆ పార్టీ నాయకులు ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఇద్దరు కార్పొరేటర్లు ఉండగా.. కొన్ని స్థానాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.