iDreamPost
android-app
ios-app

నేటి నుంచి ఉచిత లడ్డు

నేటి నుంచి ఉచిత లడ్డు

శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని ఈ రోజు సోమవారం నుంచి అందించనున్నారు. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గం నుంచి కాలినడకన వచ్చే 20 వేల మంది భక్తులకు మాత్రమే ఉచిత లడ్డును అందిస్తున్నారు. ఇకపై శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ 175 గ్రాముల లడ్డును ఉచితంగా అందివ్వనున్నారు. ప్రతి భక్తునికి ఉచిత లడ్డు ఇవ్వాలని గత నెలలో టీటీడీ బోర్డు తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అదనంగా కోరుకునే భక్తులకు ఒక్కొక్కటి రూ.50 చొప్పున టీటీడీ ఇప్పటికే అందిస్తోంది. ఇక ముందు అదే ధరకు కోరుకున్నన్ని అదనపు లడ్డులను టిటిడి అందివ్వనుంది. లడ్డు కేంద్రంలో ప్రస్తుతం నాలుగు ఎల్పీటీ కౌంటర్లు పనిచేస్తుండగా వాటి సంఖ్యను 12కు పెంచారు. భక్తులకు లడ్డుల కొరత లేకుండా ప్రతిరోజూ నాలుగు లక్షల లడ్డులను సిద్ధంగా ఉంచనుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetHepyek girişmeritbetCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Girişmeritbet