iDreamPost
android-app
ios-app

అమ్మోరిగా ‘నయనా”నందం

  • Published Mar 01, 2020 | 6:46 AM Updated Updated Mar 01, 2020 | 6:46 AM
అమ్మోరిగా ‘నయనా”నందం

దక్షిణాది సినిమా పరిశ్రమ మొత్తంలో పదేళ్లకు పైగా టాప్ పొజిషన్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ గా ఉన్న నయనతార తాజాగా అమ్మోరి అవతారం ఎత్తింది. తమిళ్ లో రూపొందుతున్న ‘మూకుతి అమ్మన్’ సినిమాలో తన ఫస్ట్ లుక్ ని యూనిట్ రిలీజ్ చేసింది. పోస్టర్లో ఉన్న నయన్ లుక్ కు టైటిల్ అర్థం కాకపోయినా మనవాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. నటుడు ఆర్జే బాలాజి దర్శకుడిగా డెబ్యు చేస్తున్నాడు. అతనితో పాటు ఎన్జే శరవణన్ కూడా ఈ బాధ్యతను పంచుకుంటాడు.

బాలాజీ కొన్ని నెలల క్రితం ఎల్కేజి అనే సెటైరికల్ కామెడీతో మంచి హిట్టు కొట్టాడు. హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడీ సినిమా కూడా అదే కోవలో ఉంటుందని చెన్నై టాక్. అమీర్ ఖాన్ పికే తరహాలో వ్యంగ్యంగా ఉంటూనే ఆలోచింపజేసేలా ఉంటుందని చెబుతున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు ఒకే ఆప్షన్ గా ఉన్న నయనతార కు ఆఫర్లు క్యు కడుతున్నా ఏది బడితే అది ఒప్పుకోవడం లేదు. తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో ఆచితూచి లెక్కలు వేసి మరీ ఓకే చెబుతోంది. బాలాజి కథకు ఓకే చెప్పిందంటే అందులో చాలా విషయమే ఉండాలి.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నిన్నటి తరం హీరోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి ఇప్పటి జనరేషన్ తోనూ ఆడిపాడటం ఒక్క నయన్ కే చెల్లింది. నారప్ప కోసం తననే అడిగారని వార్త వచ్చింది కాని తను ఒప్పుకోలేదట. అటు కోలీవుడ్ లోనూ వైవిధ్యమైన సినిమాలతో నయనతార యమా బిజీగా ఉంది. ప్రియుడు విజ్ఞేశ్ శివన్ తో పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది కాబట్టి ఇంకొంత కాలం అయ్యాక చేసుకునే ఆలోచనలో ఉన్నారట. అఫీషియల్ గా ఏదీ చెప్పదు కానీ అతనితో ఉన్న బంధం మీడియా సర్కిల్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకూ తెలిసిన విషయమే

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş