iDreamPost
android-app
ios-app

హమ్మయ్యా – రిలీజ్ డేట్ వచ్చేసింది

  • Published Aug 18, 2021 | 6:25 AM Updated Updated Aug 18, 2021 | 6:25 AM
హమ్మయ్యా – రిలీజ్ డేట్ వచ్చేసింది

కరోనా ముందు నుంచే పలుమార్లు వాయిదా పడి రెండు లాక్ డౌన్ల వల్ల మరింత ఆలస్యమైన లవ్ స్టోరీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని సెప్టెంబర్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు ఇందాక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఏడాదికి పైగా వెయిటింగ్ లో ఉన్న ఈ సినిమా కోసం నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఫ్యాన్స్ ల ఎదురు చూపులు అంతా ఇంతా కావు. ఫిదా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ బ్రాండ్ ఇమేజ్ బాగా ప్రభావం చూపిస్తోంది.

అప్పటికే ఉన్న హైప్ కు తోడు సారంగ దరియా పాట ఆన్ లైన్లో బ్లాక్ బస్టర్ కావడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రేమకథే అయినప్పటికీ అన్ని ఎమోషన్లను పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తారని పేరున్న శేఖర్ కమ్ముల మరోసారి దీని ద్వారా తన మేజిక్ ని రిపీట్ చేస్తారన్న నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది. అందుకే కేవలం లీడ్ పెయిర్ ని మాత్రమే చూపిస్తూ పబ్లిసిటీ చేసినా కూడా ఇంత క్రేజ్ వచ్చింది. ఏషియన్ గ్రూప్ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ కు పవన్ సిహెచ్ సంగీతం అందించారు. సారంగదరియా కాకుండా మిగిలిన పాటలకు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది కానీ స్క్రీన్ మీద వచ్చాక ప్లస్ అవుతాయేమో చూడాలి.

లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లు తెరిచాక చెప్పుకోదగ్గ పెద్ద రిలీజ్ ఇదే అని చెప్పాలి. ఇప్పటిదాకా వచ్చినవన్నీ బడ్జెట్ సినిమాలే. మహా అయితే ఆరేడు కోట్లకు మించి వసూళ్లు తేలేనివి. కానీ లవ్ స్టోరీ కేసు అలా కాదు. పాతిక కోట్లకు పైగానే షేర్ ని టార్గెట్ చేసుకుంటుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. విడుదల టైంకంతా ఏపిలోనూ అన్ని నిబంధనలు సడలించడంతో పాటు సెకండ్ షోలకు అనుమతులు ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో లవ్ స్టోరీ లాంటి వాటికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పండగే. అదే రోజు గోపీచంద్ సీటిమార్ ఉండొచ్చనే ప్రచారం కూడా మొదలయ్యింది కానీ ఇంకా ప్రకటన రాలేదు

Also Read : రాఖీ భాయ్ వస్తున్నట్టా రానట్టా

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş