iDreamPost
android-app
ios-app

విలేజ్ హౌసులో గొడవలు – గతంతో లాస్య కన్నీళ్లు

  • Published Nov 06, 2020 | 6:31 AM Updated Updated Nov 06, 2020 | 6:31 AM
విలేజ్ హౌసులో గొడవలు – గతంతో లాస్య కన్నీళ్లు

రేపటితో బిగ్ బాస్ కొత్త వీకెండ్ మొదలుకాబోతోంది. ఎలిమినేషన్లో ఎవరు బయటికి వెళ్తారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో టీమ్ తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా పేర్లు తొందరగా బయటికి రావడం లేదు. అలా అని లీక్ కావడం ఆగడం లేదు కానీ టైం స్పాన్ తగ్గింది. ఇక పల్లెటూరి కాన్సెప్ట్ మొన్న ప్రవేశ పెట్టిన బిగ్ బాస్ నిన్న కూడా దాన్నే కొనసాగించాడు. గొడవలు అరుపులు అలకలుతో పాటు ఈసారి పార్టిసిపెంట్స్ గుండెలు పిండేసే రేంజ్ లో తమ ట్రాజెడీ ఫ్లాష్ బ్యాక్ లు కూడా చెప్పుకున్నారు. రోజు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏడ్చేలా ప్లాన్ చేసుకుంటున్న ఆర్గనైజర్స్ ఆ విషయంలో మాత్రం నూటికి నూరుపాళ్లు సక్సెస్ అవుతున్నారు.

నిన్న జరిగిన ముఖ్యమైన సంగతుల వైపు ఓ లుక్ వేస్తే తిండి గురించి అరియనా అభిజిత్ లు ఒకరిమీద ఒకరు నిందలేసుకుని గొడవ పడ్డారు. పాన్ షాప్ ఓనర్ అవినాష్ కు అఖిల్ కు మధ్య కూడా చిన్నపాటి రచ్చ జరిగింది. ఆమ్లెట్ కోసమని అరియనా ఇంకో వివాదానికి తెరలేపింది. మధ్యలో అమ్మ రాజశేఖర్ తన అలవాటు ప్రకారం ఓవర్ చేయడంతో మోనాల్ చేతిలో ఉన్న ఫుడ్డు కాస్తా కిందపడి వృధా అయిపోయింది. ఇదంతా చూస్తున్న ఉన్న ఊరి పెద్ద సోహైల్ రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం చేసి ఫైనల్ గా రాజీ కుదిర్చాడు. ఇదంతా ఓ మోస్తరు టైం పాస్ గా అనిపించిందే తప్ప మరీ స్పెషల్ గా అయితే ఏమి లేదు.

సీక్రెట్ టాస్క్ లో భాగంగా హారిక అవినాష్ కు కోపం తెప్పించే క్రమంలో తన కళలన్నీ బయటికి తీసింది. అయితే అతగాడు తెలివిగా గుర్తుపట్టేశాడు. కానీ పాన్ షాప్ ని ధ్వంసం చేసే క్రమంలో ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయి ఈ విధ్వంస కాండ చేశారు. మధ్యలో పాన్ డబ్బా దెబ్బ తగిలిన మెహబూబ్ కూడా మాములు గొడవ చేయలేదు. ఫైనల్ గా కెప్టెన్ రేస్ లో హారికతో గెలిచాక అమ్మడు చేసిన అతి శృతి మించింది. ఇక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకునే క్రమంలో లాస్య ప్రేమ పెళ్లి జరిగాక తన ప్రెగ్నెన్సీ, మొదటి బిడ్డను బయటికి రాకముందే కోల్పోవడం, అమ్మానాన్నల గురించి చాలా ఉద్వేగానికి గురవుతూ చెప్పింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet