iDreamPost
android-app
ios-app

కుటుంబాల ఎంట్రీ – ఎమోషనల్ బిగ్ బాస్

  • Published Nov 19, 2020 | 7:24 AM Updated Updated Nov 19, 2020 | 7:24 AM
కుటుంబాల ఎంట్రీ – ఎమోషనల్ బిగ్ బాస్

మొన్న హౌస్ ని కమాండో శిబిరంగా మార్చిన బిగ్ బాస్ అందులో భాగంగా రకరకాల ఫిజికల్ టాస్కులతో సభ్యులను పరీక్షించిన సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో జనం దీన్ని బాగానే ఎంజాయ్ చేశారు. వాటిని కొనసాగిస్తూనే నిన్న సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి ఇంటిని భావోద్వేగాలతో నింపేశారు. ఇదే తరహా పద్ధతి గత సీజన్లలో చేసిందే అయినప్పటికీ ఈసారి ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. దానికి తగ్గట్టే మంచి ఎమోషనల్ టచ్ తో వదిలిన ప్రోమో సోషల్ మీడియాలో గట్టిగానే వెళ్ళింది. దీంతో ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ మీద కుటుంబ ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. వాళ్ళను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలానే కనిపించింది.

మెహబూబ్ వెళ్లిపోయేటప్పుడు వారం రోజులు అవినాష్ ను నాన్ వెజ్ కి దూరం చేయడంతో సోహైల్, హారిక అతన్ని కవ్విస్తూ మటన్ తిన్నారు. బజర్ మ్రోగడంతో డ్రిల్స్ చేస్తూనే తినాలన్న కండిషన్ ని పాటిస్తూ సోహైల్ కిందపడి దొర్లుతూ కామెడీ చేశాడు. ఇక పవర్ సేవ్ మోడ్ లో పార్టిసిపెంట్స్ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించడం అన్నింటి కంటే బాగా హై లైట్ అయిన అంశం. ఫస్ట్ వచ్చినవారు అఖిల్ తల్లి దుర్గ. కదలకుండా ఉన్న స్థితి నుంచి అమ్మను చూడగానే అఖిల్ బాగా కదిలిపోయాడు. కాస్త అరవడం తగ్గించి కూల్ గా ఉండమని అఖిల్ కి ఆవిడ హితవు పలికారు. బయట ఉన్న పాపులారిటీ గురించి చెప్పారు.

ఇక అభిజిత్ తో వస్తున్న గొడవల గురించి ప్రస్తావించి ఇదంతా గేమ్ లో మాములే అని చెప్పగా ఇక్కడ ఎలా ఉన్నా తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు అఖిల్ అభిజిత్. తప్పనిసరి పరిస్థితుల్లో గొడవ పడాల్సి వస్తోందని ఒకరినొకరు సర్దిచెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత హారిక తల్లి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. ఉన్నచోటే ఏడ్చేసింది. ఇలా ఓ సెంటిమెంట్ సీరియల్ తరహా ఈసారి రియల్ డ్రామా చక్కగా పండింది. ఏ మాటకామాటే. ఈ షోలో పాల్గొంటున్న ఎవరైనా చేసేది డబ్బులు పేరు కోసం. వ్యక్తిగతంగా నష్టపోవడం అంటూ ఏదీ ఉండదు. అలాంటప్పుడు ఏదో దేశసరిహద్దులో యుద్ధం చేస్తూ సంవత్సరాల తర్వాత తమవాళ్ళను కలుసుకున్న సైనికుల మాదిరి ఈ రేంజ్ లో ఎమోషన్ రావడం అంటే నిజంగా విశేషమే.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetHepyek girişkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş