Idream media
Idream media
ఇంజనీర్లు కూడా.. దేశంలోని నిరుద్యోగుల దీన పరిస్థితికి తాజాగా తమిళనాడులో జరిగిన ఓ సందర్భం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేయడానికి మొత్తం 549 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే ఈ 549 ఉద్యోగాలకు ఏకంగా 7వేల మందికి పైగా అప్లై చేసుకున్నారు. అప్లై చేసిన వారిలో ఎక్కువ మంది డిగ్రీలు చదివారు. ఇంజనీరింగ్ చేసినవారు, డిప్లమో హోల్డర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొనే వారు కూడా గవర్నమెంట్ ఉద్యోగంపై ఆసక్తితో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. గత పదేళ్లుగా శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న వారు కూడా తమ ఉద్యోగాలు ఇప్పుడు పర్మినెంట్ అవుతాయనే ఉద్దేశంతో వారు కూడా అప్లై చేసుకున్నారు. వీరికి జీతం రూ.15వేల 700 ఇవ్వనున్నారు.
ప్రైవేట్ ఉద్యోగాల్లో 9 నుంచి 10 గంటల వరకు పని చేస్తున్నా తమకు పది నుంచి పన్నెండువేల లోపే జీతాలు వస్తున్నాయని, అయితే శానిటేషన్ విభాగంలో ఉద్యోగం వస్తే ఉదయం 3 గంటలు సాయంత్రం మూడు గంటలు పని చేస్తే రూ.15,000 రూపాయలు వస్తాయంటున్నారు. అలాగే ప్రైవేటు ఉద్యోగాల్లో జాబ్ సెక్యూరిటీ ఉండదని, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటుందని అందుకే అప్లై చేశామని అభ్యర్ధులు చెబుతున్నారు.