iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ విజేత అభిజిత్ – ముగిసిన మహా గేమ్

  • Published Dec 21, 2020 | 6:21 AM Updated Updated Dec 21, 2020 | 6:21 AM
బిగ్ బాస్ విజేత అభిజిత్ – ముగిసిన మహా గేమ్

వంద రోజులకు పైగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తూ వచ్చిన బిగ్ బాస్ 4 ఎట్టకేలకు నిన్న ముగిసింది. అందరూ ఊహించినట్టే ముందే లీకులు వచ్చినట్టే అభిజిత్ టైటిల్ ని అందుకోగా నాగార్జున ఇచ్చిన గోల్డెన్ సూట్ కేసు ఆఫర్లో భాగంగా ప్రైజ్ మనీలో సగం సొహైల్ అందుకున్నాడు. ఇది పోటీ నుంచి తప్పుకోవడానికి అతనికి వచ్చిన మొత్తమన్న మాట. అఖిల్ మాత్రం చివరి దాకా పోటీలో ఉండేందుకే ఇష్టపడ్డాడు. ఈ కారవంద రోజులకు పైగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తూ వచ్చిన బిగ్ బాస్ 4 ఎట్టకేలకు నిన్న ముగిసింది. ణంగానే తనకంటే ఎక్కువ సొహైల్ లాభపడ్డాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దీన్ని అందుకోవడంతో అభిజిత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. జీవితంలో మళ్ళీ సాధ్యం అవుతుందో లేదో చెప్పలేని ఓ అరుదైన ఘట్టానికి హీరో అయ్యాడు.

టాప్ 5 ఫైనలిస్టులలో హారికకు లాస్ట్ ప్లేస్ దక్కగా దానికి ముందు ప్లేస్ ని అరియానా దక్కించుకుంది. సోహైల్ మూడో స్థానానికి పరిమితం కాగా అఖిల్ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. సోషల్ మీడియాతో పాటు ఇతర ఓటింగ్ మార్గాల్లో ముందు నుంచి రేస్ లో ముందడుగులో ఉన్న అభిజిత్ దానికి తగ్గట్టే గేమ్ ఆడుతూ వచ్చాడు. ఇక తన పర్సనల్ విషయాలకు వస్తే అబిజిత్ 2012లో శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇంకో రెండు మూడు చిత్రాలు కూడా ఫెయిల్ అయ్యాయి.

ఓ రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నాక పెళ్లి గోల వెబ్ సిరీస్ అభిజిత్ కు మంచి పేరు తీసుకొచ్చింది. తనలో రియల్ టాలెంట్ ని ప్రపంచానికి చూపించింది. బిగ్ బాస్ లో ఛాన్స్ రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు. పెళ్లిగోల తెచ్చిన పాపులారిటీ అతనికి అవకాశం వచ్చేలా చేసింది. ఇతరుల తరహాలో కాకుండా ముందు నుంచి మెచ్యుర్డ్ గా ఆడటం తనకు చాలా ప్లస్ అయ్యింది. బిగ్ బాస్ సైతం దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అఖిల్ ఇతరత్రా వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెట్టడం కూడా అతన్ని రేస్ లో వెనక్కు నెట్టింది. మొత్తానికి అంచనాలను నిజం చేస్తూ అభిజిత్ విన్నర్ గా నిలవడం నిన్నటి హై లైట్ గా చెప్పుకోవచ్చు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis