Idream media
Idream media
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బీజేపీ, తెరాస పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. ప్రారంభంలో బీజేపీ ఆధిక్యం చూపగా.. రౌండ్లు కొనసాగే కొద్దీ టీఆర్‌ఎస్ స్పీడు పెంచింది. ప్రస్తుతం 18 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యం 174 స్వల్ప ఓట్లకు పరిమితం అవడంతో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది.
23 రౌండ్లకు గాను ఇప్పటి వరకూ 18 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించగా.. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బీజేపీ అధిక్యం ప్రదర్శించింది. మొదటి ఐడు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. ఆరో రౌండ్‌లో బీజేపీ స్పీడ్‌కు బ్రేక్ పడింది. కారు జోరు మొదలైది. ఆరు, ఏడు రౌండ్లలో కారు ఆధిక్యంలో నిలిచింది. మళ్లీ 8, 9 రౌండ్లలో బీజేపీ పుంజుకుంది. 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్, 11వ రౌండ్‌లో బీజీపీలు ఆధిక్యత సాధించాయి. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా 12వ రౌండ్‌లో కాంగ్రెస్ 83 ఓట్ల ఆధిక్యతను సాధించింది
13వ రౌండ్ నుంచి 18వ రౌండ్ వరకూ టీఆర్‌ఎస్ జోరు కొనసాగించింది. దీంతో 4 వేలకు పైగా ఉన్న బీజేపీ మెజారిటీ 174 ఓట్లకు పడిపోయింది. టీఆర్‌ఎస్ ఆశలు పెట్టుకున్న మీర్ దొడ్డి మండలం నిరాస పరిచినా.. దౌలతాబాద్ మండలం ఉంచి కారు స్పీడు పెరిగింది.
13 నుంచి 18 రౌండ్ల వరకు వరుసగా తెరాస మెజారిటీ వస్తుండటంతో తెరాస ఆశలు సజీవంగా ఉన్నాయి. దౌలతాబాద్ మండలంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామల పరిధిలో తెరాస కు భారీ నష్టం కలుగుతుందన్న బీజేపీ అంచనాలు దెబ్బతిన్నాయి. 14 నుంచి 18 రౌండ్ల మధ్య ఈ గ్రామాల ఓట్లే లెక్కింపులు తెరాస కు మెజారిటీ వచ్చింది.
ఈ స్పీడు కొనసాగే అవకాశం ఉంది. ఇక మరో ఆరు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వరుసగా ఐదు రౌండ్లలోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించడంతో.. ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్సుకత నెలకొంది.మరో గంటన్నరలో దుబ్బాక ఫలితం వెల్లడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.