iDreamPost
android-app
ios-app

దుబ్బాక విజేత కమలమే..!

దుబ్బాక విజేత కమలమే..!

నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఆది నుంచి ఆధిక్యం దోబూచులాడినా చివరకు కమలాన్నే విజయం వరించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు 1470 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు.

23 రౌండ్లులో దుబ్బాక ఉప ఎన్నికల ఓట్లు లెక్కించారు. ఆది నుంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడింది. నువ్వా నేలా అన్నట్లు సాగిన కౌంటింగ్‌లో చివరి మూడు రౌండ్లలో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యం సాధించింది. 20వ రౌండ్‌ వరకూ ఆధిక్యంలో ఉన్న టీఆర్‌ఎస్‌.. విజయంపై ఆశలు పెట్టుంది. అయితే చివరకు విజయం బీజేపీనే వరించింది.

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,140 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,022 ఓట్లు దక్కాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి 21,961 ఓట్లు లభించాయి. మరో మూడు ఈవీఎంలు మోరాయించడంతో వాటి లెక్క తెలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వచ్చిన ఓట్లతోనే బీజేపీ గెలుపు ఖాయమైంది. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనే ఇక మిగిలి ఉంది.