iDreamPost
android-app
ios-app

దుబ్బాక ఉప ఎన్నిక : మొదటి రెండు రౌండ్లలో బీజేపీ ముందంజ

దుబ్బాక ఉప ఎన్నిక : మొదటి రెండు రౌండ్లలో బీజేపీ ముందంజ

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రధానంగా అధికారపార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత,బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది.

కాగా మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు టీఆరెస్ అభ్యర్థి సుజాతపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రఘునందన్ రావుకు 6492 ఓట్లు దక్కగా టీఆరెస్ అభ్యర్థి సోలిపేట సునీతకు 5357 ఓట్లు దక్కాయి. మొదటి రెండు రౌండ్లలో మొత్తం 1135 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా 1315 ఓట్లను సాధించింది.

అత్యంత హోరాహోరీగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న 315 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు.