iDreamPost
android-app
ios-app

చరణ్ చేతికి లైసెన్స్ – వెంకీకి స్టీరింగ్ ?

చరణ్ చేతికి లైసెన్స్ – వెంకీకి స్టీరింగ్ ?

టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం గత ఏడాది డిసెంబర్ లో మలయాళంలో విడుదలైన డ్రైవింగ్ లైసెన్స్ అనే హిట్ మూవీ రీమేక్ రైట్స్ రామ్ చరణ్ తీసుకున్నాడట. అయితే అది తాను హీరోగా నిర్మించేందుకు కాదు. మెగా యూత్ హీరోలలో ఎవరితోనైనా తీసే ఆలోచన ఉందట. అయితే ఇదొక మల్టీ స్టారర్ లాంటి సబ్జెక్టు. కీలక పాత్రలో పెద్ద హీరో కావాలి. అక్కడ పృథ్విరాజ్ చేశాడు. రెండో హీరోగా సూరజ్ నటించాడు. ఇద్దరి పోటా పోటీ పెర్ఫార్మన్స్ కి అక్కడ భారీ స్పందన దక్కింది.

ఇది తెలుగులో కూడా వర్కవుట్ అవుతుందనే అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పెద్ద స్టార్ కి మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ వీర ఫ్యాన్ గా ఉంటాడు. అయితే ఓ షూటింగ్ క్లియరెన్స్ కోసం ఆ హీరో డ్రైవింగ్ లైసెన్స్ కోసం సదరు అభిమాని సహాయం కోరతాడు. అయితే అనుకోకుండా మధ్యలో మీడియా రావడంతో ఇది కాస్తా ఇష్యూ గా మారి సదరు హీరోకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదనే ప్రచారం మొదలవుతుంది. దీనికి కారణం ఆ వెహికల్ ఇన్స్ పెక్టర్ అని భావించిన హీరో అతనితో వైరం పెట్టుకుంటాడు. ఇద్దరి మధ్య ఈగో మొదలవుతుంది. ఇది ఎలాంటి ఆసక్తికరమైన మలుపులు తిరిగి ముగుస్తుందన్నదే కథ

ఇప్పుడు ప్రచారంలో అప్ డేట్ ప్రకారం ఆ స్టార్ హీరో పాత్రను వెంకటేష్ తో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జరుగుతోందట. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాని కాస్త ఫ్రీ టైం చూసుకుని డ్రైవింగ్ లైసెన్స్ చూశాక తన నిర్ణయం చెబుతానని అన్నట్టు వినికిడి. నారప్ప షూటింగ్ లో వెంకీ చాలా బిజీగా ఉన్నాడు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ నచ్చితే ఆ రెండో హీరో పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వెంకీ ఎలాగూ ఇప్పటికే చాలా రీమేక్స్ చేశాడు. సో ఇది నచ్చితే గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది,. అయితే ఎఫ్3కి కమిట్ అయిన వెంకీ దీనికి ఎంత వరకు ఒప్పుకుంటాడో వేచి చూడాలి. అసలు డ్రైవింగ్ లైసెన్స్ హక్కులు నిజంగా చరణ్ వద్దే ఉన్నాయా లేదా అనే స్పష్టత లేదు. మొత్తానికి లూసిఫర్ తర్వాత మెగా కాంపౌండ్ ని ఆకట్టుకున్న మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్స్ అన్న క్లారిటీ అయితే వచ్చేసింది.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş