iDreamPost
iDreamPost
ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయన్నది పక్కనపెడితే ఇటీవలే విడుదలైన మాస్టర్ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యిందన్న మాట వాస్తవం. పండగ సీజన్ అందులోనూ వరస సెలవులు రావడంతో థియేటర్లు ఫుల్ గా ఉన్నాయి కానీ మాములు సమయంలో అయితే దీనికి ఎలాంటి స్పందన దక్కేదో ఈజీగా ఊహించుకోవచ్చు. విజయ్ ఇమేజ్ వల్ల తమిళనాడులో మాత్రం అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగులోనూ నిర్మాత చాలా ప్లాన్డ్ గా చేసిన రిలీజ్ వల్ల మొదటి రెండు రోజుల్లోనే డెబ్బై శాతం పైగా రికవరీ కావడం ట్రేడ్ ని సైతం షాక్ కు గురి చేసింది. ఇదే స్పీడ్ కొనసాగే అవకాశం లేదు కానీ నష్టాల బెడద తప్పినట్టే.
ఇదిలా ఉండగా దీన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ధృవీకరించడంతో విజయ్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే హీరోగా నటించేది అతను కాదు లెండి. ఇక్కడో ఇంకో ట్విస్టు ఉంది. మాస్టర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా రిలీజయ్యింది. యుట్యూబ్ లో ఫ్రీగా చూసి వందల మిలియన్ల వ్యూస్ ని కుమ్మరించే నార్త్ ఆడియన్స్ దీన్ని థియేటర్లో చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. అందుకే అక్కడ వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. అందులోనూ పాజిటివ్ టాక్ రాకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది.
ఇంతా జరిగినా రీమేక్ అని చెప్పడం మాత్రం ఆశ్చర్యమే. సినీ 1 స్టూడియోస్ అధినేత మురాద్ ఖేతాని దీన్ని నిర్మించబోతున్నారు. అయితే హీరో విలన్ ఎవరన్నది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. నిజానికి మాస్టర్ బ్యాడ్ స్టోరీ కాదు. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోయిజంని అతిగా ఎలివేట్ చేయడంలో చేసిన పొరపాట్ల వల్ల అవుట్ ఫుట్ తేడాగా వచ్చింది అంతే. కొంచెం గట్టిగా ఫోకస్ పెట్టి ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేది. అయితే దీన్ని బాలీవుడ్ లో ఎవరు డైరెక్ట్ చేస్తారనే క్లారిటీ మాత్రం రాలేదు. విజయ్ విజయ్ సేతుపతి కాంబోలాగా అక్కడ ఎవరిని సెట్ చేస్తారో వేచి చూడాలి. చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది.