దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం పై దిశ తల్లి దండ్రులు స్పందించారు. తమ పాప ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. తమ పాప తిరిగి రాదని, నిందితులకు ఇలాంటి శిక్ష పడడం తమకు ఒక ఉపశమనం అన్నారు. కూతురును కోల్పోయిన తమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. ” బాగా చదివించాము. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. గజిటెడ్ అధికారి. త్వరలో పెళ్లి చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. చాలా డిప్రెసెన్ లో ఉన్నాము. నిన్న ఆస్పత్రికి వెళ్లి సెలైన్ కట్టించుకు వచ్చాము. నిద్ర పట్టలేదు. నిద్ర మాత్రలు వేసుకున్నా పని చేయలేదు. ఇకపై ఎవరైనా ఇలాంటి పని చేయాలంటే భయపడతారు. అన్ని కేసులోనూ పోలీసులు ఇలానే స్పందించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు 100 శాతం తగ్గుతాయి. అరెస్ట్ చేసి, విచారణ, కోర్టు అంటే ఎవరూ భయపడరు. దేశంలో జరిగిన అన్ని ఘటనలలో నిందితులకు ఇలాంటి శిక్ష వేయాలి. జులాయి లు, తాగి, ఇష్టం వచ్చినట్లు చేసినా.. ఏమి కాదనుకుంటున్నారు. పోలీసులు అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి” అని దిశ తల్లి దండ్రులు పేర్కొన్నారు.