iDreamPost
android-app
ios-app

తేడా కొట్టిన డిజిటల్ డెబ్యూలు

  • Published Apr 15, 2021 | 10:07 AM Updated Updated Apr 15, 2021 | 10:07 AM
తేడా కొట్టిన డిజిటల్ డెబ్యూలు

ఒకప్పుడు తమ గ్లామర్ తో స్టార్ హీరోల సరసన నటించి భారీ మార్కెట్ ను సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్లకు ఇప్పుడు ఓటిటి సెకండ్ ఇన్నింగ్స్ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. సదరు సంస్థలు ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలు, పారితోషికాలు, కాల్ షీట్లు అన్నీ రీజనబుల్ గా ఉండటంతో ఎక్కువ ఆలోచించకుండా వాటివైపు మొగ్గు చూపుతున్నారు. వెబ్ సిరీస్ లో స్కోప్ ఎక్కువ ఉండటంతో పాటు దానికి తగ్గట్టే అమౌంట్ కూడా వస్తుంది. అందుకే వీలైనన్ని రోజులు ఇవి చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చనే ధోరణిలో సదరు కథానాయికలు సాగుతున్నారు. అలా ఇప్పుడు ప్రత్యేకంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి.

ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కు ప్రస్తుతం అవకాశాలకు మరీ లోటేమి లేకపోయినా రెండు నెలల క్రితం డిస్నీ హాట్ స్టార్ కోసం చేసిన ‘లైవ్ టెలికాస్ట్’ దారుణమైన రివ్యూలు రిపోర్టులతో ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు సైతం యావరేజ్ ప్రోడక్ట్ ని ఇవ్వలేకపోయాడు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే ఆహాలో ‘లెవెన్త్ అవర్’ ద్వారా దర్శనమిచ్చింది. పెర్ఫార్మన్స్ పరంగా వంకలు లేవు కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డీల్ చేసిన విధానం ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్ ని సక్సెస్ చేయలేకపోయింది. సినిమా రేంజ్ లో ప్రమోషన్లు చేసినా కూడా లెవెన్త్ అవర్ ఫైనల్ గా యావరేజ్ కంటే కిందే నిలిచిపోయింది.

ఇక త్రిష చేసిన ‘పరమపదం విలయట్టు’ నిన్నటి నుంచి హాట్ స్టార్ లోనే తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఓ రాజకీయ నాయకుడి హత్యతో ముడిపడిన అమాయకురాలైన డాక్టర్ పాత్రలో త్రిష తనవరకు బాగానే చేసింది కానీ దర్శకుడు తిరుగ్ ఎప్పుడో తొంభై దశకం నాటి టేకింగ్ ని ఫాలో కావడంతో ఇది కూడా నిరాశపరిచింది. టైటిల్ కూడా మార్చకుండా తెలుగులో రిలీజ్ చేయడంతో కనీసం తన ఫ్యాన్స్ కు కూడా తెలియకుండా పోయింది. ఇలా తక్కువ టైంలో ఈ ముగ్గురు బ్యూటీ క్వీన్స్ కి ఒకేరకమైన డిజిటల్ రిజల్ట్ దక్కడం చూస్తే కంటెంట్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al