iDreamPost
android-app
ios-app

తల్లి కర్కశత్వం.. హోంవర్క్ చేయలేదని చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మండుటెండలో..

  • Published Jun 09, 2022 | 9:46 AM Updated Updated Jun 09, 2022 | 11:11 AM
తల్లి కర్కశత్వం.. హోంవర్క్ చేయలేదని చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మండుటెండలో..

కన్నకూతురిపై ఆ తల్లి కర్కశత్వాన్ని చూపించింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా మండుటెండలో మిద్దెపై వదిలేసింది. హోం వర్క్ చేయలేదన్న కోపంతో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మిట్టమధ్యాహ్నం మండుటెండలో వదిలేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా.. ఆ పక్కింటి వ్యక్తి వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అవుతోంది.

ఢిల్లీలోని టుకుమీపూర్ లో చిన్నారి కుటుంబం ఉంటోంది. ఐదేళ్ల వయసున్న ఆ చిన్నారి 1వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. హోం వర్క్ చేయలేదన్న కోపంతో ఆ తల్లి చేసిన పని మాతృత్వానికే కళంకం తెచ్చింది. మిద్దెపై మండుటెండలో ఉన్న చిన్నారి ఏడుపు విన్న పక్కింటి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కు ట్యాగ్ చేశారు. ఎండవేడిమి తాళలేక చిన్నారి పెట్టిన ఆర్తనాదాలు నెటిజన్లచే కన్నీళ్లు పెట్టించాయి.

చిన్నారి పట్ల ఇంత కర్కశత్వాన్ని ప్రదర్శించిన తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీసులు చిన్నారి తల్లిపై కేసు నమోదు చేశారు. బాధిత చిన్నారి కుటుంబాన్ని గుర్తించామని, ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ట్వీట్ చేశారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap