iDreamPost
android-app
ios-app

త‌నక‌న్నా రెండేళ్ల చిన్న‌వాడితో, మ‌హిళ వివాహేత‌ర సంబంధం, చివ‌ర‌కు…

  • Published May 25, 2022 | 5:05 PM Updated Updated May 25, 2022 | 5:06 PM
త‌నక‌న్నా రెండేళ్ల చిన్న‌వాడితో, మ‌హిళ వివాహేత‌ర సంబంధం, చివ‌ర‌కు…

ఇద్ద‌రిదీ ఒకే చోట ఉద్యోగం. ఆమెకు పెళ్ల‌య్యింది. అత‌నిక‌న్నా రెండేళ్లు పెద్ద‌ది. ఇద్ద‌రూ ప్రేమించుకొంటున్నారు. ఎవ‌రికీ తెలియ‌కుండా ఎంత‌కాలం జాగ్ర‌త్త‌ప‌డ‌లేరుక‌దా! ఈ ప్రేమ‌విష‌యం తెలిసి, ఇరు కుటుంబాల్లో గొడ‌వ‌లు త‌ప్పవు. అలాగ‌ని వ‌దిలి ఉండ‌లేరు. అందుకే వైవాహేత‌ర సంబంధాన్ని వ‌దులుకోలేక‌, ఈ జంట ఆత్మ హ‌త్య చేసుకుంది.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, రాజీవ్ న‌గ‌ర్ కు చెందిన నామ వేణుగోపాల్(24) గోపాల్ న‌గ‌ర్ లోని ఓ ప్రైవేట్ క్లినిక్ రిసెప్ష‌న్ లో ప‌నిచేస్తున్నాడు. అక్క‌డే మ‌చ్చ పూజ(26) కూడా వ‌ర్క్ చేస్తోంది. ఇద్ద‌రిదీ ఒకే కులం. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుట్టింది. పూజ‌ను నాలుగేళ్ల‌క్రితం ద‌గ్గ‌రి బంధువుకిచ్చి పెళ్లిచేశారు. భ‌ర్త‌తో ఆమె కాపురం స‌వ్యంగా సాగ‌డంలేదు. పెళ్లికాని వేణుగోపాల్ తో స‌న్నిహితంగా తిరుగుతోంది.

ఈ విష‌యం తెలిసి కుటుంబంలో గొడ‌వ‌లు. వివాహేత‌ర సంబంధంపై భ‌ర్త త‌ర‌చు అడిగేవాడు. ఈనెల 15న ఇంటికి రాలేదు. పోలీస్ స్టేష‌న్ లో భార్య అదృశ్య‌మైంద‌ని భ‌ర్త ఫిర్యాదు చేశాడు.

విష‌యం తెలిసిన జంట‌, ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లా జ‌గ‌దేవ‌పూర్ మండలం పీర్ల‌ప‌ల్లి అట‌వీ ప్రాంతంలోని ధ‌ర్మారం చౌర‌స్తా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఓ చెట్టుకు ఉరేసుకున్నారు.
జంట ఆత్మ‌హ‌త్య‌పై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş