iDreamPost
android-app
ios-app

Crime News విశాఖ నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌

  • Published May 12, 2022 | 4:12 PM Updated Updated May 12, 2022 | 4:12 PM
  • Published May 12, 2022 | 4:12 PMUpdated May 12, 2022 | 4:12 PM
Crime News విశాఖ నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌

విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెం, బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి, మృతి చెందిన కేసులో, సంచ‌లనాత్మ‌క విష‌యాలు బైట‌కొచ్చాయి. ఆమె మృతిదేహానికి, కేజీహెచ్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వ‌హించిన‌ అనంత‌రం, రిపోర్టు పోలీసుల‌కు అందింది. సృజన ఆక‌స్మాత్తుగా కుప్పకూలిపోవ‌డానికి కార‌ణం పాయిజన్‌ తీసుకోవడ‌మేన‌ని వైద్యులు నిర్దారించార‌ని పోలీసులు చెప్పారు. పెళ్లికి ముందు విషాన్ని ఎందుకు తీసుకుంది? కార‌ణాలు ఏంటి? పెళ్లి ఇష్టంలేదా?

బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహం మొద‌లైంది. మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సృజన పెళ్లి పీటలపైనే కుప్పకూలింది. అంద‌రూ షాక్. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్య కారణాల వ‌ల్ల ఆమె చ‌నిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇప్పుడు విషం తాగ‌డం వ‌ల్లే ఆమె మ‌ర‌ణించింద‌న్న సంగ‌తి తెలిసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş