Idream media
Idream media
1.మ్యాచింగ్ తేకపోతే మాస్క్ కూడా వేసుకోదు
2.మూడు ఫుల్ బాటిళ్లు రిటర్న్ ఇస్తామని చెప్పినా మూడు పెగ్గుల మందు అప్పు ఇచ్చేవాడు లేదు
3.బతుకు పంక్చరై ఒకడు ఏడిస్తే, బండి పంక్చరై ఇంకోడు ఏడ్చాడు
4.ఆవాలు కొనడానికి వెళుతూ అరగంట మేకప్ అయిందట!
5.ఇక మన సర్వీస్‌లో సర్వీస్ ఆటో ఎక్కేరోజులు వస్తాయో రావో!
6.పనిలేని పెళ్లాం
మొగుడికి హెయిర్ కటింగ్ చేసిందట
7.తుమ్మెద, తుమ్మెద అని పాట పాడినా ఇపుడు తంతారు
8.కిట్లు పంచడానికి వెళ్లి కరోనా తగిలించుకున్నాడట
9.గుడిలో రాముడికే దిక్కులేకపోతే
హనుమంతరాయడు తెప్ప తిరునాల అడిగాడట
10.బార్లు బార్లా తెరిచే రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
11.రోడ్లు ఖాళీగా ఉన్నాయని డ్రైవింగ్ నేర్చుకోడానికి వెళ్లాడట
12.భారత్- చైనా స్నేహం వల్లే ఇండియాలో కరోనా విజృంభించలేదు – ఒక కమ్యూనిస్టు వ్యాఖ్య
13.పీఠాధిపతులు ఏం చేస్తున్నారంటే, పీఠ వేసుకుని భోంచేస్తున్నారట
14.గడ్డం పెంచుకున్న ప్రతివాడు స్వామీజీ కాడు, అది కరోనా గడ్డం
15.ఐసోలేషన్‌కి రారా బాబూ అంటే , ఇంకో నలుగురికి కరోనా అంటించి వస్తా ఉండు అన్నాడట
16.కడిగి పారేశాను అంటే ఎవర్నో అనుకున్నా, చేతుల్నా!
17.యాగం చేస్తే పారిపోడానికి అది అల్లాటప్పాకాదు, కమ్యూనిస్టు చైనా నుంచి వచ్చింది
18.అన్నం వండరా మగడా అంటే , బియ్యాన్ని శానిటైజర్‌తో కడుగుతా అన్నాడట!
19.పస్ట్రేషన్ పెళ్లాం -రోటి పచ్చడి చేయమంటే మొగున్ని పచ్చడి కింద కొట్టిందట!
20.కరోనా అయిపోతే పెగ్గులకి బదులు మగ్గులు తాగుతా అన్నాడట!