Idream media
Idream media
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ తరచూ చేపడుతున్న సమీక్షలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోంది. లక్షల సంఖ్యలో చేస్తున్న పరీక్షలతో వైరస్ ప్రభావిత ప్రాంతాలను కట్టడి చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దీనికి తోడు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స తో రికవరీ రేటు పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే పాజిటివిటీ రేటు 12.31 శాతం ఉండగా.. రికవరీ రేటు 84.48 ఉంది. ఈ లెక్కలన్నీ ప్రజలకు కాసింత భరోసా కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,84,371 కోవిడ్ పరీక్షలు నిర్వహించాం. 17వ తేదీన ఒక్క రోజే 75 వేల పరీక్షలు చేశాం. ప్రస్తుతం 94,453 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
వైద్యం కోసం అక్కర్లేదు చింత…
కొత్తగా ఎవరైనా కరోనా బారిన పడ్డా చికిత్స కోసం భయపడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్లు 18,609 ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. వాటిలో ప్రస్తుతం 5,723 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సదుపాయం లేని బెడ్లు 15,060 ఉండగా, వాటిలో 9,777 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూ బెడ్లు 4,469 ఉండగా, వాటిలో 2,246 మంది చికిత్స పొందుతున్నారు. 2,522 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా, 178 మంది రోగులు వాటిపై చికిత్స పొందుతున్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రులలో 38,025 బెడ్లు అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 36,232 బెడ్ల వినియోగం జరిగింది. కోవిడ్ ఆస్పత్రులలో 17,924 మంది రోగులు, కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)లో 15,625 మంది రోగులు చికిత్స పొందుతుండగా, హోం ఐసొలేషన్‌లో 60,905 మంది ఉన్నారు.
పూర్తి స్థాయి సదుపాయాలు
కొవిడ్ చికిత్స కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ప్రభుత్వం పూర్తి సదుపాయాలను అందుబాటులో ఉంచింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్స కోసం 268 ఆస్పత్రులను సిద్ధం చేయగా, వాటిలో 230 ఆస్పత్రులను ఇప్పటి వరకు వినియోగించారు. నర్సింగ్ ఆర్డర్లీస్ (మేల్, ఫిమేల్), శానిటేషన్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శిక్షణ నర్సులకు సంబంధించి అని జిల్లాలలో 20,415 పోస్టులకు అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు 12,014 మంది నియామకం జరిగింది. ప్రజలకు అత్యంత మెరుగైన సేవలందించేలా 104, 108, 14410 కాల్ సెంటర్లు పని చేస్తున్నాయి. ఎన్95 మాస్కులు 5,21,350, పీపీఈ కిట్లు 7,61,097 అందుబాటులో ఉన్నాయి. ప్లాస్మా థెరపీకి సంబంధించి, 9 జిల్లాలలోని ప్రధాన ఆస్పత్రులలో 308 కాన్వలసెంట్ ప్లాస్మా సేకరించగా, ఇప్పటి వరకు 265 వినియోగించారు. ఇలా అన్ని రకాల చర్యలూ ప్రభుత్వం తీసుకుంటోంది.