iDreamPost
android-app
ios-app

Unstoppable With NBK Season 2:అన్‌స్టాపబుల్‌: రెండో సీజన్‌ తొలి గెస్ట్ మెగాస్టార్?

  • Published Jun 24, 2022 | 1:16 PM Updated Updated Jun 24, 2022 | 1:16 PM
Unstoppable With NBK Season 2:అన్‌స్టాపబుల్‌: రెండో సీజన్‌ తొలి గెస్ట్ మెగాస్టార్?

బాల‌య్యలోని రియ‌ల్ యాటిట్యూడ్ ని ఓటీటీ మీద‌కు తీసుకొచ్చిన క్రేజీ టాక్‌షో ‘అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే’(Unstoppable With NBK) ఆహాలో సూప‌ర్ స‌క్సెస్. గెస్ట్ ఎవ‌రైనా, షో మాత్రం బాల‌య్యదే. చురుకుపుట్టించేలా ప్ర‌శ్న‌లు, మేనరిజం, పంచ్‌ డైలాగ్స్‌, అప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే కామెడీతో బాలయ్యా నేషన‌ల్ వైడ్ గా అన్‌స్టాపబుల్‌ను పాపుల‌ర్ చేశారు. స్టార్ల‌ను గెస్ట్ లుగా తీసుకొచ్చి, ప‌ర్స‌న‌ల్ నుంచి ఫ్యామిలీ వ‌ర‌కు చాలా విష‌యాల‌ను రాబ‌ట్టారు.

సూప‌ర్ హిట్ టాక్‌తో అన్‌స్టాపబుల్‌ షో ముగిసింది. అప్ప‌టి నుంచే సెకండ్ సీజ‌న్ ఎప్పుడంటూ ఆడియ‌న్స్ నుంచి ఎంక్వైరీలు మొద‌లైయ్యాయి. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. త్వరలోనే రెండో సీజన్ గురించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. మొద‌టి సీజ‌న్ లో మెగాస్టార్ తో బాల‌య్య కాంబినేష‌న్ ను అంద‌రూ కోరుకున్నారు. కాని సెకండ్ సీజ‌న్ షో తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా, మెగాస్టార్‌ చిరంజీవి రాబోతున్నారు.

అన్‌స్టాపబుల్‌ షో సెకండ్‌ సీజన్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు ఆహా ప్లాన్ చేసింది. అందుకే స‌ర్ ప్రైజ్ గా సెకండ్‌ సీజన్‌ తొలి ఎపీసోడ్‌కు చిరంజీవి వస్తే బాగుంటుంద‌ని నిర్మాత అర‌వింద్ భావిస్తున్నారు. ఇండియ‌న్ ఐడల్ తెలుగు కూడా ఫైనల్స్ లో అంత క్రేజ్ రావ‌డానికి కార‌ణం, బాల‌య్య‌, చిరంజీవి. అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌ అగష్టులో ప్రారంభం​ కానుంది. షో ప్రీప్రొడక్షన్‌ పనులను తెరవెనుక పూర్తిచేశారు.

 

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbet