వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా రాష్ట్ర ప్రజలకు పరిచయం అయ్యారు. కడప ఎంపీగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే రీతిలో ముందుకు వెళితే తమకు ఇబ్బందేనని ఆరోజు నుంచే ఆయన మీద ఒక రకమైన ముద్ర వేసే ప్రయత్నాలు చేశారు. ఆయనకు గర్వం ఎక్కువ అని, అందరినీ గౌరవించరు అని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చారు. కానీ ఆయన ఏంటో జనానికి తెలియడానికి ఎక్కువ కాలం అయితే పట్టలేదు. ఆయన పాదయాత్ర ద్వారా దాదాపు అన్ని నియోకవర్గాల్లోనూ పర్యటించడం, క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలు తెలుసుకోవడమే కాక, తన మీద జరిగింది అంతా దుష్ప్రచారమే అని చెప్పకనే చెప్పినట్టయింది.
జగన్ ఏంటో తెలుసుకున్న జనం ఆయనని ముఖ్యమంత్రిని చేశారు, అది కూడా మునుపెన్నడూ లేనివిధంగా, భారీ ఎత్తున. అయితే ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన ఎప్పటికప్పుడు తన మానవత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. మానవ సంబంధాలకు ఎక్కువ వాల్యూ ఇచ్చే ఆయన అధికారులను సైతం అన్న అనే సంబోధిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని కొంతమంది తప్పు పట్టచ్చు గాక, అయితేనేం ఆయా అధికారులు ఎంతో ఆప్యాయంగా ఫీల్ అవ్వడమే కాక అంతకన్నా మరింత బాధ్యతగా పని చేస్తారు. ఇక జగన్ గొప్పతనం, ఆయనలోని నిరాడంబరత మరోసారి బయట పడ్డాయి. ఈ రోజు వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ అవార్డులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, పలువురుమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు.
2021 సంవత్సరానికి 29 వైయస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైయస్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో సాహిత్య విభాగం నుంచి అవార్డు దళిత రచయిత, మేధావి కత్తి పద్మారావుకు కూడా లభించింది. అయితే కత్తి పద్మారావు లేవలేని స్థితిలో ఉండడంతో ఆయనను వీల్ చైర్ లో తీసుకు వచ్చారు కుటుంబసభ్యులు. అలా వచ్చిన ఆయనకు అవార్డు అందించిన తరువాత ఆయన మళ్లీ వీల్ చైర్ లో కూర్చున్నాక ఆయన కాళ్ళు పెట్టుకునే ఫుట్ రెస్ట్ ను జగన్ స్వయంగా పెట్టడం గమనార్హం. వందలాది మంది మీడియా ప్రతినిధులు, ఇతర జనం ఉన్నారా? లాంటివి ఏమీ చూడలేదు జగన్, ఒక మనిషిగా మరో మనిషికి వెంటనే చేయాల్సింది చేసేశారు..జగన్ వ్యక్తిత్వాన్ని మరో రకంగా చిత్రీకరించే వారికి ఇలాంటివి కనపడవు ఎందుకో?
Also Read : YSR Awards 2021 – వైఎస్సార్ గొప్ప వ్యక్తి : గవర్నర్