iDreamPost
iDreamPost
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . ముఖ్యంగా విద్యారంగంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి . పాఠశాలల్లో విద్యార్ధులకు మధ్యాహ్నం అందించే భోజనంలో నాణ్యత పెంచడం దగ్గరనుంచి , ప్రభుత్వం పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం కింద కల్పిస్తున్న మౌళికసదుపాయాల వరకు అలాగే ప్రభుత్వ బడిలో ఇంగ్లీషు విద్యనుండి, విద్యార్ధులకు యునిఫాం ఇవ్వడం వరకు ఎక్కడా కార్పొరేట్ స్కూల్స్ కి తీసిపోకుండా విద్యా వ్యవస్ధ మార్పు పై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం .
తాజాగ సీఎం జగన్ పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందించాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలుండాలని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో ముఖ్యమంత్రి జగన్ సంచలన మార్పులకు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ పరిణామం అని పలువురు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు .