ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళ మంచి చెడులను తెలుసుకుంటూ తన గొప్ప మనసు ఎలాంటిదో అందరికీ తెలియజేయడమే కాకుండా వాళ్ళ మనసును గెలుచుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్ వివాహానికి ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు.
తాడేపల్లి సీఎస్‌ఆర్ కళ్యాణమండపంలో సబార్డినేట్ రవి ప్రసాద్ వివాహం జరిగింది. ఈ వివాహకార్యక్రమానికి సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం జగన్ భారతీరెడ్డిల దంపతులు ఆశ్వీరదించారు. ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా తన వివాహానికి హాజరు కావడం పట్ల రవి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఇతర అధికారులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.
కాగా నవంబర్ 4 వ తేదీన సీఎం జగన్ ఏలూరు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడమే కాకుండా మాజీ మేయర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే.