దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో అత్యుత్తమ ప్రజారంజక పాలనతో దూసుకుపోతున్న జగన్,ఓ ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించిన సర్వేలో దేశంలో ఉన్న అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను 90 శాతం పూర్తి చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జగన్ ప్రజా సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలుచేస్తూ,ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ సర్వేలో ముఖ్యమంత్రి జగన్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఏబీపీ–సీఓటర్ సంస్థ “దేశ్ కా మూడ్” పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను వివిధ ప్రశ్నలను అడిగిన ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించగా ముఖ్యమంత్రి జగన్ అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటిస్థానంలో నిలవగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండోస్థానంలో నిలిచారు.
ఏబీపీ-సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ముఖ్యమంత్రులు వీరే…
1) నవీన్ పట్నాయక్ – ఒడిశా
2) అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ
3) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్
4) పినరయి విజయన్ – కేరళ
5) ఉద్ధవ్ ఠాక్రే – మహారాష్ట్ర
6) భూపేశ్ బఘేల్ – ఛత్తీస్‌గఢ్
7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్
8) శివరాజ్ సింగ్ చౌహాన్ – మధ్య ప్రదేశ్
9) ప్రమోద్ సావంత్ – గోవా
10) విజయ్ రూపానీ – గుజరాత్