iDreamPost
iDreamPost
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆఫ్ టాలీవుడ్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. లాక్ డౌన్ టైంలో చాలా కథలు విన్నప్పటికీ దేనికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అన్నీ చర్చల దశలోనే ఆగిపోయాయి. పైగా ఆచార్య నిర్మాణ వ్యవహారాలతో పాటు తండ్రి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా తనే చూసుకోవడంతో చాలా బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేయొచ్చనే టాక్ వచ్చింది కానీ ఆ వార్త తర్వాత సైలెంట్ అయ్యింది. అతనేమో అక్కడ షాహిద్ కపూర్ తో హిందీ రీమేక్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ త్వరలో తన డెబ్యు డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో చేసే అవకాశాలు ఉన్నాయనే కొత్త ప్రచారం మొదలయ్యింది. అతను కూడా విజయ్ దేవరకొండతో ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా ఇంకే కమిట్మెంట్స్ ఇవ్వలేదు. స్క్రిప్టులు రాసుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ హీరోయిజంని చూపడంలో మునుపటి వాడి పూరిలో తగ్గలేదని రుజువయ్యింది. అందుకే మరోసారి చిరుత కాంబినేషన్ ను రిపీట్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఇది అధికారికంగా వచ్చిన వార్త కాదు. పక్కగా తెలియడానికి ఇంకా టైం పట్టొచ్చు.
ఇది ఫ్యాన్స్ కు ఖచ్చితంగా గుడ్ న్యూసే అవుతుంది. చిరుతలో రామ్ చరణ్ ని లాంచ్ చేసిన తీరు అభిమానులకు బాగా నచ్చింది. కమర్షియల్ గా చిరుత భారీ అద్భుతాలు చేయకపోయినా చిరంజీవి వారసుడికి కావాల్సిన ప్యాడింగ్ అందించింది. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి చరణ్ ఇమేజ్, మార్కెట్ కి తగ్గట్టు మరో మాస్ ఎంటర్ టైనర్ చేయడం పూరికి పెద్ద విషయం కాదు. అన్నీ కుదిరితే ఈ కాంబో పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ కాకుండా రామ్ చరణ్ ఇంకా ఆచార్య షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ కు తన అవసరం లేని రోజులను కాల్ షీట్స్ గా కొరటాల శివకు కేటాయించబోతున్నాడు